విజయ్ దేవరకొండ తన వృత్తికి ఎంత ప్రాధాన్యత ఇస్తాడో ఫ్యామిలీ విషయంలో కూడా అంతే కేరింగ్ తీసుకుంటాడు. విజయ్ దేవరకొండ తాజాగా తన తల్లి గురించి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం కింగ్డమ్ చిత్రంలో నటిస్తున్నాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. మే 30న రిలీజ్ కావాల్సిన కింగ్డమ్ చిత్రం జూలై కి పోస్ట్ పోన్ అయింది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది.

షూటింగ్స్ తో విజయ్ దేవరకొండ బిజీబిజీగా గడుపుతున్నారు. విజయ్ దేవరకొండ తన వృత్తికి ఎంత ప్రాధాన్యత ఇస్తాడో ఫ్యామిలీ విషయంలో కూడా అంతే కేరింగ్ తీసుకుంటాడు. విజయ్ దేవరకొండ తాజాగా తన తల్లి గురించి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఫ్యామిలీ మొత్తం కలిసి బయట రెస్టారెంట్ కి డిన్నర్ కి వెళ్దామని తన తల్లి ప్రేమగా అడిగినట్లు విజయ్ దేవరకొండ ట్వీట్ చేశారు. ఆమె తనకి పెట్టిన వాట్సాప్ మెసేజ్ ని కూడా విజయ్ దేవరకొండ లీక్ చేశాడు. ఈ వాట్సప్ చాట్ లో విజయ్ దేవరకొండ తల్లి.. నీకు కుదిరినప్పుడు మనమంతా కలిసి బయటకు డిన్నర్ కి వెళ్దాం అని అడిగింది. వెంటనే విజయ్ దేవరకొండ ఓకే చెప్పాడు. ప్లేస్ ఫిక్స్ చేసి చెప్తానని రిప్లై ఇచ్చాడు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
Scroll to load tweet…


విజయ్ దేవరకొండ ట్వీట్ చేస్తూ.. డిన్నర్ కి వెళ్దామని అమ్మ సడన్ గా అడిగింది. మేమంతా కలిసి డిన్నర్ కి వెళ్లి చాలా కాలం అయింది. మనమంతా వర్క్ లో పడి ఫ్యామిలీని మర్చిపోతున్నాం. గత రాత్రి మా ఫ్యామిలీ మొత్తం చాలా బాగా సమయం గడిపాం. మీరు కూడా మీ అమ్మానాన్నలతో సమయం గడపడం మర్చిపోకండి వాళ్ళని బయటికి తీసుకెళ్లండి అని పేర్కొన్నాడు. తన తల్లిదండ్రులు, తమ్ముడు ఆనంద్ దేవరకొండ తో కలిసి విజయ్ దేవరకొండ డిన్నర్ కి వెళ్లారు. ఆ దృశ్యాలను కూడా విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.