Asianet News TeluguAsianet News Telugu

‘12th ఫెయిల్’ మూవీ.. ఫర్ఫెక్ట్ రివ్యూ ఇచ్చిన విజయ్ దేవరకొండ.. కానీ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే?

డాషింగ్ హీరో విజయ్ దేవరకొండ Vijay Deverakonda రీసెంట్ బయోపిక్ 12th Fail పై సరైన రివ్యూను ఇచ్చారు. కానీ రౌడీ స్టార్ కు అభిమానులు ఇంట్రెస్టింగ్ గా రిప్లై ఇస్తున్నారు. 

Vijay Deverakonda gave His Review on 12th Fail Movie NSK
Author
First Published Jan 14, 2024, 9:41 PM IST

ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ రియల్ లైఫ్ ఆధారంగా వచ్చిన చిత్రం ‘ట్వెల్త్ ఫెయిల్’ 12th Fail.  గతేడాదే ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయవంతమైంది. హిందీలో మంచి ఆదరణ పొందిన `ట్వెల్త్ ఫెయిల్‌` (12th Fail) మూవీ 2023, నవంబర్ 3న తెలుగులో రిలీజ్ అయ్యి ఇక్కడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. కలెక్షన్ల పరంగానూ ‘జెర్సీ’, ‘ఆకాశమే నీ హద్దురా’ వంటి చిత్రాలను మించి రూ.66 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఇలా ప్రేక్షకాదరణతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా అదరగొట్టింది. 

ఇక రీసెంట్ గా ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ (IMDB) కూడా 9.2 టాప్ రేటింగ్ ఇచ్చింది. ఈ క్రమంలో టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ vijay Deverakonda కూడా ఈ సినిమాపై స్పందించారు. తనదైన శైలిలో రివ్యూను ఇచ్చారు. ‘12th ఫెయిల్ అద్భుతం.. పిల్లల భవిష్యత్తు కోసం పోరాడుతున్న ప్రతి తల్లి, తండ్రి, అమ్మమ్మల కోసమే ఈ చిత్రం. చిత్రంలోని దుష్యంత్ సర్‌ పాత్ర మరొకరికి స్ఫూర్తినిచ్చేలా ఉంది. పాండే, గౌరీ భాయ్ వంటి పాత్రలు ప్రతి స్నేహితుడి కోసం.. బ్లెస్సింగ్ ను అందించే శ్రద్ధా పాత్ర... అలాగే రాబోయే మనోజ్ లకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రార్థనలు వెల్లివిరుస్తున్నాయి. ప్రతి పోరాటాన్ని అధిగమించి విజయం సాధించాలి. 12th ఫెయిల్ మూవీ కాస్ట్ అండ్ టీమ్ కు ధన్యవాదాలు’ అంటూ తన రివ్యూను ఇచ్చారు. 

ఇక ఈ చిత్రం నిజజీవిత కథతో తెరకెక్కడంతో ప్రేక్షకులు ఆదరించారు. 12వ తరగతి ఫెయిల్ అయిన కుర్రాడు ఐపీఎస్ అధికారి ఎలా అయ్యాడనేది చిత్రం. ఈ చిత్రానికి వచ్చిన రెస్పాన్స్ తో ఆస్కార్ Oscar బరిలోనూ పోటీపడుతోంది. ఇప్పటికే ఇండిపెండెంట్ గా మేకర్స్ నామినేషన్ కూడా వేశారు. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శక, నిర్మాత విధూ వినోద్‌ చోప్రా డైరెక్ట్ చేశారు. యోగేష్‌ ఈశ్వర్‌తో కలిసి వినోద్‌ చోప్రా నిర్మించారు. విక్రాంత్‌ మెస్సీ హీరోగా నటించగా, మేథా శంకర్‌ హీరోయిన్‌గా, ఆనంద్‌ వీ జోషి, ప్రియాంశు చట్టర్జీ కీలక పాత్రల్లో నటించారు. 

ఇదిలా ఉంటే.. ట్వీటర్ లో తన రివ్యూను ఇచ్చిన విజయదేవరకొండకు ఫ్యాన్స్ ఇంట్రెస్టింగ్ గా రిప్లై ఇస్తున్నారు. అన్న మీరూ ఇలాంటి సినిమాలు చేయాలని కోరుకుంటున్నామని కొందరు... లేదన్న ఒక్క భారీ యాక్షన్ మూవీని ప్రకటించండి అన్న అంటూ విజయ్ ని కోరుతున్నారు. చివరిగా ‘ఖుషి’తో హిట్ అందుకున్న విజయ్ నెక్ట్స్ ‘ఫ్యామిలీ స్టార్’ Family Starతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సంక్రాంతికి రావాల్సిన సినిమా వాయిదా పడింది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios