విజయ్ దేవరకొండ యూత్ లో  సెన్సేషన్. ఆ విషయం ఆయన సినిమా ఓపినింగ్స్ రావటాన్ని బట్టి అర్దమవుతుంది. అయితే ఆ తర్వాత సినిమా నిలబడటం అనేది సినిమా కంటెంట్ ని బట్టి..తర్వాత చేసే ప్రమోషన్స్ ని బట్టి ఉంటుంది. రీసెంట్ గా విజయ్ దేవరకొండ  చేసిన డియర్ కామ్రేడ్ సినిమా ఓపినింగ్స్ అదిరిపోయాయి. కానీ వీకెండ్ కాగానే కలెక్షన్స్  జోరు తగ్గిపోయింది.  సినిమా గురించి మాట్లాడటం మానేసారు. ప్లాఫ్ గా  ఫైనల్ చేసేసారు.

అయితే ఇందులో విజయ్ దేవరకొండ చేసిన మిస్టేక్ కూడా ఉందంటున్నారు. సాధారణంగా బాలీవుడ్ లో సినిమా రిలీజ్ కు ముందు ఓ రేంజిలో ప్రమోషన్స్ ఉంటాయి.  రిలీజ్ తర్వాత హీరో,దర్శక,నిర్మాతలు ఎవరి గొడవల్లో వారు పడిపోతారు. సినిమాని పట్టించుకోరు. హిట్ అయితే హిట్ లేకపోతే లేదు. కానీ తెలుగు కు వచ్చేసరికి ఇక్కడ పరిస్దితి వేరు. సినిమా రిలీజ్ ముందు ఓ మాదిరి హీరోకు ఎలాగో ఓపెనింగ్స్ వస్తాయి.

టీజర్, ట్రైలర్, పోస్టర్స్ సరిగ్గా ఉంటే అసలు ఆ సమస్యే ఉండదు. కానీ రిలీజ్ తర్వాత మాత్రం కలెక్షన్స్ డ్రాప్ అవకుండా నిలబెట్టుకుంటూ రావాలి. మరీ ముఖ్యంగా సినిమా మిక్సెడ్ టాక్ ఉన్నప్పుడు మరీ జాగ్రత్తలు పడాలి. ఎప్పటికప్పుడు సినిమాని మీడియాలో నానేలా ప్రమోషన్స్ ప్లాన్ చేయాలి. ఆ విషయంలో డియర్ కామ్రేడ్ ఫెయిలైంది అంటున్నారు. 

విజయ్ దేవరకొండ ...బాలీవుడ్ పద్దతిలోకి వెళ్లి సినిమా రిలీజ్ కు ముంది మ్యూజిక్ టూర్ లంటూ దేశం మొత్తం చుట్టేసాడు. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ ఫలితం రిలీజ్ రోజు ఓపినింగ్స్ లో కనపడింది. కానీ  ఆ తర్వాత సినిమాకు సంభందించి ప్రమోషన్స్ ఆపేసారు. మీడియాలో కూడా ఎక్కడా ఈ సినిమా గురించి మాట్లాడటం అనేది జరగలేదు. దాంతో యావరేజ్ , డివైడ్ టాక్ అనుకున్న సినిమా ప్లాఫ్ వైపుకు దూసుకుపోయింది.

అదే సమయంలో దాన్ని పట్టుకుని , ప్రమోషన్స్ తో నిలబెడితే మినిమం సినిమా గా మిగిలేది అంటున్నారు ట్రేడ్ జనం. అందుకు ఉదాహరణగా ఇస్మార్ట్ శంకర్  సినిమాని ఉదాహరణగా చూపెడుతున్నరు.  ఆ సినిమా టీమ్  రిలీజ్ అనంతరం...ఆంధ్రా , తెలంగాణా లలో టూర్స్ వేసారు. ఏదో విధంగా మీడియాలో నానటానికి ప్రయత్నం చేసారు. సక్సెస్ సాధించారు.