రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండ ప్రేమలో ఉన్నారనే ప్రచారం చాలా కాలంగా వినిపిస్తుంది. కానీ విజయ్ ఆమెకి బ్రేకప్ చెప్పాడట. కొత్త లవ్ స్టోరీని స్టార్ట్ చేశాడట.
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ప్రేమలో ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. దామిద్దరం ఫ్రెండ్స్ అని వాళ్లు చెబుతున్నారు. దేనికైనా ఓ లిమిట్ ఉంటుందని, అది దాటొద్దని వార్నింగ్ ఇచ్చింది రష్మిక. అయితే పలు మార్లు వీరిద్దరు కలిసి కనిపించడం, వెకేషన్‌కి వెళ్లడంతో రూమర్స్ ఊపందుకున్నాయి. ఇద్దరి మధ్య ఉన్న ప్రేమనా, స్నేహమా అనేది మాత్రం పెద్ద సస్పెన్స్.
ఇదిలా ఉంటే తాజాగా ఈ ఇద్దరు బ్రేకప్ చెప్పుకున్నారట. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా విడిపోయారట. సైలెంట్‌గా ఈ ఇద్దరు బ్రేకప్ చెప్పుకున్నారని తెలుస్తుంది. తాజాగా ఓవర్సీస్ క్రిటిక్‌గా భావించే ఉమైర్ సంధు ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. ఈ ఇద్దరు విడిపోయారని, కానీ విజయ్ దేవరకొండ మాత్రం అప్పుడు కొత్త లవర్‌ని కనిపెట్టాడని, ప్రస్తుతం ఆమెతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడని అంటున్నారు.
రష్మిక మందన్నతో బ్రేకప్ తర్వాత విజయ్ దేవరకొండ కొత్తగా టైమ్ పాస్ లవ్‌ని కనుగొన్నాడు. `ఖుషీ` సినిమా కాశ్మీర్ షెడ్యూల్‌లో సమంతతో ఆయన ప్రేమలో పడ్డారు. వీరిద్దరు శ్రీనగర్‌లో ఒకే హోటల్‌లో ఉంటున్నారు` అని పేర్కొన్నారు ఉమైర్ సంధు. దీంతో ఇప్పుడు ఈ క్రిటిక్‌ని సోషల్ మీడియా వేదికగా ఆడుకుంటున్నారు నెటిజన్లు. అటు సమంత ఫ్యాన్స్, ఇటు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ దారుణంగా ఆడుకుంటున్నాడు. ఇటీవలే సమంత, నాగచైతన్యలపై దారుణమైన కామెంట్లు చేశాడు ఉమైర్ సంధు. దీనికి గట్టిగానే విమర్శలెదుర్కొన్నారు.
ఉమైర్ సంధుని బూతులు తిడుతున్నారు. దారుణమైన పదజాలం వాడుతూ ఆయన్ని ఎండగడుతున్నారు. తన పాపులారిటీ కోసం ఇలాంటి ఫేక్ వార్తలు క్రియేట్ చేస్తున్నాడని అంటున్నారు. సమంత,విజయ్ దేవరకొండ ఉండే హోటల్ లో బాత్ రూమ్‌లు కడుతున్నావా? అంటూ ఆడుకుంటున్నారు. నీ పప్పులు ఇక్కడ ఉడకవు అని, ఒకప్పుడు బాలీవుడ్ వెంట పడ్డాడని, అక్కడ పట్టించుకోకపోవడంతో ఇప్పుడు పాపులర్‌గా ఉన్న తెలుగు చిత్ర పరిశ్రమపై పడ్డాడని, తెలుగు స్టార్స్ పై కామెంట్లు చేస్తే మరింత పాపులర్ కావచ్చు అనుకుంటున్నాడని అంటున్నారు క్రిటిక్స్.
ఓ వైపు ఊహించని పెయిర్స్ మధ్య ఎఫైర్లు అంటగట్టి, తన పబ్బం గడుపుకుంటున్నాడని, ఇవి శృతి మించితే ఫలితం చవిచూడాల్సి వస్తుందని సమంత, విజయ్ అభిమానులు గట్టిగానే హెచ్చరిస్తున్నారు. క్రిటిక్స్ ని ట్రోల్స్ చేస్తున్నారు. ఇక సమంత, విజయ్ దేవరకొండ కలిసి `ఖుషి` సినిమాలో నటిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. మొన్నటి వరకు అనారోగ్యంతో బాధపడ్డ సమంత గత వారమే ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ అయ్యింది. ప్రస్తుతం కాశ్మీర్‌లో చిత్రీకరణ జరుగుతుంది. అప్పుడే వీరిద్దరి మధ్య ఎఫైర్స్ అంటగట్టడం గమనార్హం.
మరోవైపు హిందీలో `సిటాడెల్` వెబ్ సిరీస్ రీమేక్‌లో సమంత నటిస్తున్న విషయం తెలిసిందే. వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నారు. ఇటీవలే ఈ వెబ్ సిరీస్ షూటింగ్‌లో పాల్గొంది సమంత. అక్కడ షెడ్యూల్ పూర్తి చేసుకుని `ఖుషి` సినిమా షూటింగ్‌లో పాల్గొంది. మరోవైపు సమంత ప్రధాన పాత్రలో నటించిన `శాకుంతలం` చిత్రం ఏప్రిల్‌లో విడుదల కాబోతుంది.
