#FamilyStar:“ఫ్యామిలీ స్టార్”..చిరు సూపర్ హిట్ పాయింట్ తో ...?

  ఈ సినిమాలోనూ విజ‌య్ ఇంట్లో మృణాల్ అద్దెకు దిగి, ప్రేమ‌లో ప‌డుతుందని అంటున్నారు. అయితే ‘గ్యాంగ్ లీడ‌ర్‌’లో  ప్రత్యేకమైన  విల‌న్ , రివైంజ్ ఉంటంది. 

Vijay Deverakonda Family Star storyline similar to Gang Leader Jsp


స్టార్ హీరో విజయ్ దేవరకొండ “ఫ్యామిలీ స్టార్” మూవీ ఏప్రిల్ 5వ తారీఖు విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు-శిరీష్‌ నిర్మిస్తున్నారు. మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్. ఈ సినిమాపై మంచి బజ్ ,క్రేజ్ ఉంది. ఇక ఈ సినిమాని ఫ్యామిలీ ఆడియన్స్ కోసం తీస్తున్నారని అర్దమవుతోంది. అలాగే ఈ చిత్రం కథ ..చిరంజీవి సూపర్ హిట్ ‘గ్యాంగ్ లీడ‌ర్‌’కు పోలిక ఉంటుందని ప్రచారం జరుగుతోంది.

మీడియాలో వస్తున్న వార్తలను బట్ిట చూస్తే ...చిరంజీవి ‘గ్యాంగ్ లీడ‌ర్‌’మాదిరిగానే ఈ సినిమాలో  ఇద్ద‌రు అన్న‌ల  త‌మ్ముడిగా  విజ‌య్ కనిపిస్తారు. అలాగే గ్యాంగ్ లీడర్ లో  చిరు ఇంట్లోకి విజ‌య‌శాంతి రెంట్‌కి దిగి.. ప్రేమ‌లో ప‌డే ఎపిసోడ్ ఉంటుంది. ఇక్కడ  ఈ సినిమాలోనూ విజ‌య్ ఇంట్లో మృణాల్ అద్దెకు దిగి, ప్రేమ‌లో ప‌డుతుందని అంటున్నారు. అయితే ‘గ్యాంగ్ లీడ‌ర్‌’లో  ప్రత్యేకమైన  విల‌న్ , రివైంజ్ ఉంటంది. ఇక్క‌డ మాత్రం కథ మాత్రం ‘గీత గోవిందం’తరహాలో సాగుతుందని, ఆమె పైనే హీరో  సరదాగా రివేంజ్ తీర్చుకుంటాడని , ఆ క్రమంలో వచ్చే కామెడీ, ఎమోషన్ సినిమాకు సినిమాని నిలబడతాయని నమ్ముతున్నారట. ‘గీత గోవిందం’కు ఓ వెర్షన్ లా గ్యాంగ్ లీడర్ స్క్రీన్ ప్లే డిజైన్ లో సాగుతుందని చెప్పుకుంటున్నారు. ఏదైమైనా రెండూ సూపర్ హిట్స్ కాబట్టి ఈ సినిమా కూడా అదే స్దాయిలో వర్కవుట్ కావచ్చు. 
 
ఫ్యామిలీ, మాస్‌ యాక్షన్‌ అంశాలతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో విజయ్‌ దేవరకొండ పాత్ర సరికొత్త పంథాలో ఉంటుందని చెబుతున్నారు. ఈ చిత్రానికి కెమెరా: కేయూ మోహనన్‌, సంగీతం: గోపీసుందర్‌, క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌: వాసు వర్మ, రచన-దర్శకత్వం: పరశురామ్‌ పెట్ల.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios