ఒక్క సినిమాతోనే జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నటుడు విజయ్‌ దేవరకొండ. పెళ్లి చూపులు సినిమాతో హీరోగా సక్సెస్‌ అందుకున్న విజయ్‌, తరువాత అర్జున్‌ రెడ్డి సినిమాతో నేషనల్‌ లెవల్‌లో సెన్సేషన్‌ సృష్టించాడు. ఆ తరువాత గీతా గోవిందంతో మరో బ్లాక్‌ బస్టర్‌ తన ఖాతాలో వేసుకున్న విజయ్‌ దేవరకొండ వరుసగా పాన్‌ ఇండియా సినిమాల మీద దృష్టి పెట్టాడు.

నోటా, డియర్‌ కామ్రేడ్ సినిమాలను పాన్‌ ఇండియా లెవల్‌ లో రిలీజ్‌ చేసిన విజయ్ దేవరకొండ, ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న పూరి జగన్నాథ్‌ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు. కరణ్‌ జోహర్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ప్రూవ్‌ చేసుకోవాలనుకుంటున్నా విజయ్‌..

ఈ సినిమా తరువాత చేయబోయే సినిమాను కూడా అదే రేంజ్‌లో ప్లాన్‌ చేస్తున్నాడు విజయ్‌ దేవరకొండ. విభిన్న చిత్రాల దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ఓకే చెప్పాడట. ఈ సినిమా దిల్‌ రాజు 100 కోట్ల బడ్జెట్‌తో నిర్మించనున్నాడని తెలుస్తోంది. పూరి సినిమా తరువాత మజిలీ ఫేం శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ఓకే చెప్పాడు విజయ్‌ దేవరకొండ. ఈ సినిమా  పూర్తయిన తరువాత ఇంద్రగంటి సినిమా సెట్స్‌ మీదకు వెళ్లే ఛాన్స్‌ ఉంది.