స్టార్ హీరోలిద్దరిని ఒకే ఫ్రెమ్ లో చూస్తే ఆ కిక్కు ఎలా ఉంటుందో ఊహించుకోవడం కష్టం. ప్రస్తుతం సౌత్ సినీ లవర్స్ ని ఫిదా చేస్తున్న ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. టాలీవుడ్ రౌడీ బాయ్ అండ్ కన్నడ మాస్ భాయ్ యష్ పక్కపక్కనే మొదటి సారి కనిపించడం ఆడియెన్స్ ని ఆకట్టుకుంటోంది. 

డియర్ కామ్రేడ్ ప్రమోషన్స్ లో భాగంగా యష్ కన్నడ నుంచి తన మద్దతు ఇచ్చాడు. డియర్ కామ్రేడ్ సౌత్ లో నాలుగు భాషల్లో రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. కన్నడ లో యష్ ద్వారా ట్రైలర్ రిలీజ్ చేయించి అక్కడ కూడా మంచి బజ్ క్రియేట్ చేశారు. ఇప్పటికే కన్నడ భామ రష్మిక వల్ల క్రేజ్ బాగానే పెరిగింది. 

ఇక KGF స్టార్ కూడా సినిమా ట్రైలర్ ను అభిమానుల ముందు రిలీజ్ చేసేసరికి రౌడీ హీరోపై కన్నడ ఫ్యాన్స్ స్పెషల్ గా ఫోకస్ పెట్టారు. మరి సినిమా అక్కడ ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి. భరత్ కమ్మ దర్శకత్వం వహించిన డియర్ కామ్రేడ్ ఈ నెల 26న రిలీజ్ కానుంది.