నెక్స్ట్ బిగ్ బాస్ హోస్ట్ విజయ్ దేవరకొండ..?

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 20, Aug 2018, 3:15 PM IST
vijay devarakonda will be the next bigg boss host
Highlights

నిన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్ లో 'గీత గోవిందం' సినిమాను ప్రమోట్ చేసుకోవడం కోసం వచ్చిన విజయ్ తన కామెడీ, స్పాంటేనిటీతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. హౌస్ లో కంటెస్టెంట్ గా ఉన్న సునైనాకి ఫన్నీ టాస్క్ లను ఇస్తూ అందరినీ నవ్వించాడు

టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. యూత్ అతడి నటనకు, మాటలకి ఫిదా అయిపోతున్నారు. ఇటీవల విడుదలైన 'గీత గోవిందం' సినిమాతో విజయ్ క్రేజ్ మరింత పెరిగిందనే చెప్పాలి. తన అమాయకపు నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. వెండితెరపై దూకుడు ప్రదర్శించే విజయ్ బుల్లితెరపై కూడా సందడి చేసి అందరినీ మెప్పించాడు.

నిన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్ లో 'గీత గోవిందం' సినిమాను ప్రమోట్ చేసుకోవడం కోసం వచ్చిన విజయ్ తన కామెడీ, స్పాంటేనిటీతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. హౌస్ లో కంటెస్టెంట్ గా ఉన్న సునైనాకి ఫన్నీ టాస్క్ లను ఇస్తూ అందరినీ నవ్వించాడు. ఒక స్టేజ్ లో హోస్ట్ నానిని డామినేట్ చేశాడనే చెప్పాలి. కొద్దినిమిషాల పాటు షో మొత్తాన్ని తన మాటలతో ఎంగేజ్ చేసేశారు.

హౌస్ మేట్స్ తో సరదాగా ముచ్చటిస్తూ తనలో కూడా ఒక మంచి హోస్ట్ ఉన్నాడని నిరూపించాడు. స్టేజ్ మీద విజయ్ పెర్ఫార్మన్స్ చూసిన ఆడియన్స్ హోస్ట్ గా విజయ్ మరింత బాగా చేస్తాడనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది సీజన్ 3కి హోస్ట్ గా ఆయన్నే పెట్టాలని సూచిస్తున్నారు. మరేం జరుగుతుందో చూడాలి!

ఇవి కూడా చదవండి.. 

బిగ్ బాస్2: నామినేషన్స్ లో తనీష్ షాక్ ఏంటో..?

బిగ్ బాస్2: సునైనాతో విజయ్ దేవరకొండ ఏం చేయించాడంటే!

loader