హీరో విజయ్ దేవరకొండ కొత్త చిత్రం ‘డియర్ కామ్రేడ్’.రీసెంట్ గా టాక్సీవాలా చిత్రంతో హిట్ కొట్టిన విజయ్ దేవరకొండ ఈ సినిమాపై పూర్తి స్దాయి దృష్టిని పెట్టారు. ఏ మాత్రం ఛాన్స్ తీసుకోదలుచుకోలేదని సమాచారం. మరో ప్రక్క ఈ చిత్రం నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ దీ అదే పరిస్దితి. వరసపెట్టి సవ్యసాచి, అమర్ అక్బర్ ఆంటోని రెండు సినిమాలు చాచిపెట్టి కొట్టినట్లు అయ్యింది.

రెండు డిజాస్టర్స్ వరసగా రావటంతో డబ్బు పోవటంతో పాటు మార్కెట్లో తమ బ్యానర్ కు ఉన్న ఇమేజ్ కు పెద్దే దెబ్బే తగిలింది. మైత్రీ బ్యానర్ అనగానే ఉత్సాహంగా జరిగే బిజినెస్ ఇప్పుడు ఖచ్చితంగా డల్ అవుతుంది. దాంతో తిరిగి తమ బ్యానర్ పరువు ని నిలబెట్టాలనే వారు భావిస్తున్నారు. ఈ నేఫధ్యంలో ‘డియర్ కామ్రేడ్’వీరిద్దరికి సవాల్ గా మారింది.

దాంతో ఈ సినిమా ఎలా వచ్చిందో విజయ్ దేవరకొండ,నిర్మాతలు రష్ వేసుకుని చూసారట. అయితే తాము స్క్రిప్టులో విన్నది..అనుకున్నట్లుగా కొన్ని సన్నివేశాలు రాలేదని భావించారట. దాంతో దర్శకుడు భరత్ కమ్మని పిలిచి రీషూట్ చేయమని చెప్పారట. ఆ సీన్స్ అన్ని  మళ్లీ తీయాలని నిర్ణయించుకున్నారట. ఇలా చేయటం  వలన మొదట అనుకున్న బడ్జెట్ పెరిగినా  అవుట్ ఫుట్ మాత్రం అదిరిపోవాలని చెప్పారట. 

ఇక  డియర్ కామ్రేడ్ చిత్రాన్ని భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్, బిగ్‌బెన్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. విజయ్ దేవరకొండతో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. సుజిత్ సరంగ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ మూవీకి జైకృష్ణ మాటలు రాస్తున్నారు. 

రామాంజనేయులు ఈ సినిమాకు ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: భరత్ కమ్మ, సంగీతం: జస్టిన్ ప్రభాకరన్, కెమెరామెన్: సుజిత్ సరంగ్, ఎడిటర్: శ్రీజిత్ సరంగ్, డైలాగ్స్: జైకుమార్, బ్యానర్స్: మైత్రి మూవీమేకర్, బిగ్‌బెన్ సినిమాస్ నిర్మాతలు: నవీన్ యర్నేని, రవిశంకర్ యలమంచిలి, మోహన్ చిరుకూరి (సి.వి.ఎం), యస్.రంగినేని.