మజిలీ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత, విజయ్ దేవరకొండ జంటగా నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం ప్రారంభం అయింది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. విజయ్ దేవరకొండ, సమంతలది క్రేజీ కాంబినేషన్.

మజిలీ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత, విజయ్ దేవరకొండ జంటగా నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం ప్రారంభం అయింది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. విజయ్ దేవరకొండ, సమంతలది క్రేజీ కాంబినేషన్. వీరిద్దరూ తొలిసారి మహానటి చిత్రంలో కలసి నటించారు. ఇప్పుడు వీరిద్దరూ కలసి నటిస్తున్న పూర్తి స్థాయి చిత్రం ఇదే. 

తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. శివ నిర్వాణ మరో రొమాంటిక్ ఎంటర్టైనర్ తో రాబోతున్నారు. నేడు ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. క్రేజీ సర్ ప్రైజ్ ఏంటంటే ఈ చిత్రానికి పవన్ కళ్యాణ్ ఆల్ టైం క్లాసిక్ 'ఖుషి' చిత్ర టైటిల్ ఫిక్స్ చేశారు. ఫస్ట్ లుక్ గమ్మత్తుగా ఆకట్టుకుంటోంది. 

ఫస్ట్ లుక్ లో సమంత, విజయ్ దేవరకొండ ఇద్దరూ కనిపిస్తున్నారు. సమంత కొంగుని విజయ్ దేవరకొండ డ్రెస్ కి ముడి వేసి ఉంది. సో ఈ మూవీ రొమాంటిక్ అండ్ లవ్ ఎంటర్టైనర్ గా ఉండబోతున్నట్లు అర్థం అవుతోంది. విజయ్,సమంత కెరీర్ లలో ఇదొక మెమొరబుల్ ఫిల్మ్ గా మిగులిపోతుందనే వైబ్స్ టైటిల్, ఫస్ట్ లుక్ తో ఏర్పడుతున్నాయి. ప్రేమలో గెలిస్తే ఖుషి, ఆ ప్రేమను కుటుంబంతో పంచుకుంటే మరింత ఖుషి. జీవితంలో ఈ సంతోషాన్ని మించిన సంపద లేదు అన్నట్లు "ఖుషి" టైటిల్, ఫస్ట్ లుక్ డిజైన్ క్రియేటివ్ గా ఉండి ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా కశ్మీర్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న తర్వాత హైదరాబాద్, వైజాగ్, అల్లెప్పి లలో మిగతా షూటింగ్ చేయనున్నారు.

అలాగే ఈ చిత్ర రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. న్నట్లు "ఖుషి" టైటిల్, ఫస్ట్ లుక్ డిజైన్ క్రియేటివ్ గా ఉండి ఆకట్టుకుంటున్నాయి. డిసెంబర్ 23,2022 న తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించారు.

Scroll to load tweet…