డియర్ కామ్రేడ్ సినిమాతో ఊహించని ఫెయిల్యూర్ ని అందుకున్న విజయ్ దేవరకొండ నెక్స్ట్ సినిమాతో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని కష్టపడుతున్నాడు. వీలైనంత త్వరగా మళ్ళీ ఆడియెన్స్ ని మెప్పించాలని స్పీడ్ పెంచున్నట్లు తెలుస్తోంది. క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో విజయ్ ఒక డిఫరెంట్ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. గత ఏడాది సెట్స్ పైకి వచ్చిన ఈ సినిమా షూటింగ్ చాలా ఆలస్యంగా ఎండింగ్ కి వచ్చింది. 

దర్శకుడు క్రాంతి మాధవ్ సినిమాకు తుది మెరుగులు దిద్దుతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఫైనల్ గా సినిమా టైటిల్ ను మంగళవారం ఉదయం 11గంటలకు ఎనౌన్స్ చేయనున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా సాగే ఈ కథలో రాశి ఖన్నా - ఐశ్వర్య రాజేష్ విజయ్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ఇక సినిమాకు సంబందించిన టైటిల్ పై పలు రకాల రూమర్స్ వినిపిస్తున్నప్పటికీ అవేమి నిజం కావని తెలుస్తోంది. 

సినిమా టైటిల్ ఎవరు ఊహించని విధంగా ఉంటుందట. ఇక ఈ సినిమా సక్సెస్ కావడం చిత్ర యూనిట్ లో ప్రతి ఒక్కరికి అవసరం. ముఖ్యంగా దర్శకుడు క్రాంతి ఓనమాలు - మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు వంటి సినిమాతో మెప్పించినప్పటికీ చివరగా సునీల్ తో చేసిన ఉంగరాల రాంబాబు డిజాస్టర్ గా నిలిచింది. దీంతో ఈ సినిమాతో సక్సెస్ అందుకోవాలని దర్శకుడు కష్టపడుతున్నాడు.