విజయ్ దేవరకొండ తన నెక్స్ట్ సినిమా టైటిల్ ను ఎనౌన్స్ చేశాడు. క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో విజయ్ ఒక రొమాంటిక్ లవ్ స్టోరీలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. గత ఏడాది సెట్స్ పైకి వచ్చిన ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల తరువాత ఎండింగ్ కి వచ్చింది. ఇక సినిమా టైటిల్ పై గత కొన్నాళ్లుగా అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. 

రీసెంట్ గా బ్రేకప్ అనే టైటిల్ కూడా బాగా వైరల్ అయ్యింది. ఫైనల్ గా చిత్ర యూనిట్ రూమర్స్ కి చెక్ పెట్టి ఎవరు ఊహించని టైటిల్ ను ఎనౌన్స్ చేసింది. 'వరల్డ్ ఫెమస్ లవర్' అని సెట్ చేసిన టైటిల్ యూత్ ని ఎక్కువగా ఎట్రాక్ చేస్తోంది. మాస్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న విజయ్ ఈ సినిమాతో ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తాడో చూడాలి. 

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా టీజర్ ని కూడా వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలనీ విజయ్ గ్యాంగ్ ప్లాన్ చేసుకుంటోంది. ఇక సినిమాలో విజయ్ సరసన రాశి ఖన్నాతో పాటు ఐశ్వర్య రాజేష్ - క్యాథెరిన్ - ఇజబెల్లె వంటి బ్యూటిఫుల్ హీరోయిన్స్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు.