Asianet News TeluguAsianet News Telugu

సమంత నా మరదలు, వీహెచ్ తాతా చిల్...తొడగొట్టకు: విజయ్ దేవరకొండ

  • అర్జున్ రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత హన్మంతరావు విమర్శలు
  • మూవీలో అంతా బూతేనని, ప్రదర్శన నిలిపేయాలని డిమాండ్
  • వీహెచ్ అభ్యంతరాలపై ఘాటుగా,నీటుగా స్పందించిన విజయ్ దేవరకొండ
vijay devarakonda tweet reply to congress leader hanumanthrao

విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ వంగ దర్శకత్వంలో తెరకెక్కిన అర్జున్ రెడ్డి చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. అయితే అర్జున్ రెడ్డి చిత్రం సెన్సార్ బోర్డ్ నుంచి ఏ సర్టిఫికెట్ పొందింది. ఈ మూవీలో ముద్దు సీన్లు ఎక్కువయ్యాయని, పైగా డాక్టర్ మద్యం తాగి వైద్యం చేసినట్లు గొప్పగా చెప్పుకుంటున్నాడని, డ్రగ్స్ తీసుకునే డాక్టర్ ను చూపించడమేంటని, అసలు పెళ్లి కాకుండానే గర్భవతిని చేసే సీన్స్ సినిమాలో పెట్టి యువతకు ఏం సందేశం ఇస్తున్నారో అర్థం కావట్లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సినిమాను ఆపకుండా మంత్రి కేటీఆర్ ఆ సినిమాకు మద్ధతిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ విమర్శలు గుప్పించారు.

 

అర్జున్ రెడ్డి సినిమా రిలీజ్ కు ముందే ప్రమోషన్ కోసం వేసిన పోస్టర్ లో.. హిరో హిరోయిన్ ల ముద్దు ఇమేజ్ పెట్టారు. ఆ ఇమేజ్ పబ్లిక్ ప్లేసెస్ లో, బస్సులపై, ఇక్కడా అక్కడా వేయడంతో అటెన్షన్ క్రియేట్ అయింది. అయితే... ఈ ముద్దులేందిరబై అంటూ రంగంలోకి దిగిన కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ పోస్టర్లు పీకడం నుంచి మొదలు పెట్టి.. ఇప్పుడు ఏకంగా మంత్రి కేటీఆర్ నే టార్గెట్ గా అర్జున్ రెడ్డి సినిమా నిలిపేయాలంటూ ఆందోళన చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.

 

ఇక గత వారంరోజులుగా... సినిమా పాజిటివ్ టాక్ తో మాంచి కలెక్షన్స్ సాధిస్తోంది. ఇప్పటికే యుఎస్ఎలో కూడా రికార్డు కలెక్షన్లు సాధిస్తున్న అర్జున్ రెడ్డి మూవీ మరిన్ని కలెక్షన్స్ దిశగా  దూసుకెళ్తోంది. మరోవైపు స్టార్ డైరెక్టర్లు, హీరోహీరోయిన్లు అర్జున్ రెడ్డి సినిమాను తెగ పొగిడేస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ ఈ చిత్రాన్ని హీరో విజయ్ దేవరకొండను ఆకాశానికి ఎత్తుతుండగా... రాజమౌళి లాంటి దర్శకధీరుడు కూడా పొగడ్తలతో ముంచెత్తాడు. రానా లాంటి హీరోలు, సమంత లాంటి హిరోయిన్ లు కూడా అర్జున్ రెడ్డి సూపర్ అన్నారు.

 

ఇదిలా వుంటే వీహెచ్ ఆరోపణలకు సోషల్ మీడియాలో రిప్లై ఇచ్చాడు విజయ్ దేవరకొండ. నీ అద్భుతమైన ఆలోచన వల్ల.. అర్జున్ రెడ్డిని పొగిడిన కేటీఆర్ నా చుట్టమయ్యాడు. నాకు కేటీఆర్ చుట్టమైతే.. నా సినిమా బాగుందన్న రాజమౌళి నా తండ్రి.. రానా,నాని,శర్వానంద్, వరుణ్ తేజ్ నా సోదరులు. సమంత, అను ఎమాన్యుయెల్, మెహ్రీన్, తదితరులంతా నా మరదళ్లు. నా సినిమా హిట్ చేసిన వాళ్లంతా నా కవలలు. ఇక రామ్ గోపాల్ వర్మ సార్ మనిద్దరిలో ఎవరికి అబ్బ అవుతారో తెలీదు. మేమంతా కష్టపడి సినిమాలు తీస్తూ, కొత్త మైండ్ సెట్ తో ముందుకెళ్తుంటే మనలో కొందరు ఇంకా పనికిరాని కబుర్లు చెప్తూ తొడగొడుతున్నారు. వద్దు తాతా చిల్.. అంటూ వీహెచ్ ను టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశాడు విజయ్ దేవరకొండ.

Follow Us:
Download App:
  • android
  • ios