టాలీవుడ్ యంగ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటించిన 'డియర్ కామ్రేడ్' సినిమా మే 31న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. భరత్ కమ్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా కనిపించనుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకి ఓ చిక్కొచ్చి పడింది. మే 31న ఈ సినిమా రావాలని ఫిక్స్ అయితే ఇప్పుడు అదే సమయానికి సూర్య నటించిన 'ఎన్‌జీకే' చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

దీంతో 'డియర్ కామ్రేడ్' సినిమా యూనిట్ ఆలోచనలో పడింది. సూర్య సినిమాను తమిళంతో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేస్తారు. పైగా ఆయనకి తమిళంలో ఫాలోయింగ్  మాములుగా లేదు.

ఈ క్రమంలో ఆయనకి పోటీగా విజయ్ సినిమాను విడుదల చేయడం కరెక్ట్ కాదని భావిస్తోన్న యూనిట్ 'డియర్ కామ్రేడ్'ని వారం రోజులు ఆగి జూన్ 6న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరేం జరుగుతుందో చూడాలి!