టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ రోజురోజుకి పెరిగిపోతుంది. వరుస విజయాలతో తన సత్తా చాటుతున్నాడు. టాలీవుడ్ లో ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో 'నోటా' చిత్రంతో కోలివుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చాడు.

ఈ మధ్యకాలంలో అతడు బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే వార్తలు వినిపించాయి. కరణ్ జోహార్ ప్రాజెక్ట్ లో విజయ్ దేవరకొండ నటిస్తాడనే వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలపై విజయ్ దేవరకొండ నుండి ఎలాంటి అధికార ప్రకటన లేదు.

విజయ్ నటించిన 'అర్జున్ రెడ్డి' సినిమా బాలీవుడ్ లో రీమేక్ అవుతుండడంతో అక్కడ కూడా విజయ్ పేరు బాగానే పాపులర్ అయింది. ఈ మధ్య ఓ కార్యక్రమంలో జాన్వీ కపూర్.. విజయ్ దేవరకొండ ప్రస్తావన తీసుకొచ్చింది. దీంతో బాలీవుడ్ ప్రేక్షకులు విజయ్ దేవరకొండ గురించి సెర్చ్ చేయడం మొదలుపెట్టారు.

ఇప్పట్లో విజయ్ కి బాలీవుడ్ లో నటించే ఆలోచన లేదని తెలుస్తోంది. కానీ త్వరలోనే ఆయన ఓ బాలీవుడ్ సినిమాలో అతిథి పాత్రలో కనిపించనున్నాడట. ఈ సినిమా 2020లో ప్రేక్షకుల ముందుకు వస్తుందని అంటున్నారు. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సివున్నాయి!