ఫ్యాన్స్ కు అప్పుడప్పుడు షాకింగ్ సర్ ప్రైజ్ ఇస్తుంటాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ఈసారి పెద్ద ప్లానే వేశాడు. తన అభిమానుల కోసం పెద్ద గిఫ్ట్ రెడీ చేశాడు. 

సినిమాలు ప్లాప్ అయినా.. తన ఇమేజ్ మాత్రం తగ్గకుండా జాగ్రత్త పడుతున్నాడు రౌడీ హీరో విజయ్ దేవరకోండ. ఏదో ఒకరకంగా అభిమానుల్లో తన పరువు కాపాడుకుంటున్నాడు. ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేస్తున్నాడు. లైగర్ ప్లాప్ తో కాస్త సైలెంట్ అయిన విజయ్.. తన అభిమానుల కోసం ఊహించని విధంగా న్యూ ఇయర్ గిఫ్ట్ తో సర్ ప్రైజ్ ఇచ్చాడు. మనాలీలో మంచు పర్వతాల అందాలను చూసేందుకు 100 మంది అభిమానులను పంపిస్తానని ప్రకటించాడు. ఇందుకు సంబంధించి వివరాలను తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ లో ఓ వీడియోను పోస్ట్ చేసి వెల్లడించాడు. 

ఇన్ స్టాలో ఈ విధంగా పోస్ట్ పెట్టాడు విజయ్ దేవరకొండ.. మీలో 100 మంది పర్వతాల వద్దకు వెళతారు. హ్యాపీ న్యూ ఇయర్. మీ కోసం బిగ్ కిసెస్, ఎంతో ప్రేమ అందిస్తున్నాను. ఇది దేవర శాంతా అప్ డేట్. మీలో 100 మందిని మనాలీ ట్రిప్ కోసం పంపిస్తున్నాననేది తెలుసు అంటూ అందులో అప్ డేట్ ఇచ్చాడు. అక్కడ ఫుడ్, ట్రావెల్, లార్డిజింగ్ నేనే చూసుకుంటాను. మనాలీకి ఐదు రోజుల పర్యటన ఉంటుంది. మంచు దుప్పటేసిన పర్వతాలకు, ఆలయాలకు, మఠాల ను చూసి సంతోషంతో గడిపేలా ప్లాన్ రకరకాల యాక్టీవిటీస్ ప్లాన్ చేశాను అంటూ వెల్లడించాడు. 

అంతే కాదు ఈ టూర్ కు అప్లై చేసుకోమంటూ కోరాడు విజయ్. 18 ఏళ్లు నిండి, నన్ను సోషల్ మీడియాలో ఫాలో అయ్యేవారు గూగుల్ డాక్యుమెంట్ ను ఫిల్ చేయండి. మీలో 100 మందిని ఎంపిక చేసి మనాలీకి పంపిస్తాను. మీతో నేను కూడా జాయిన్ అవుతాను అని విజయ్ దేవరకొండ అభిమానులకు ఊహించని కానుకను ప్రకటించాడు. దాంతో విజయ్ ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు. ఆ 100మందిలో తాము కూడా ఉండాలని పరితపిస్తున్నారు. 

View post on Instagram

గతంలో కూడా ఇలా రకరకాల స్కీమ్ లతో సందడి చేశాడు విజయ్. కరోనా టైమ్ లో మిడిల్ క్లాస్ ఫండ్ అంటూ.. నిత్యవసరాలు అందించాడు. కష్టంలో ఉన్న ఫ్యాన్స్ రిక్వెస్ట్ పెట్టుకుంటే వారిని కాపాడతానన్నారు. ఇప్పుడు యూత్ తో ఇంకా క్రేజ్ పెంచుకోడానికి ఇలా టూర్ ప్లాన్ చేశాడు విజయ్ దేవరకొండ. రీసెంట్ గా లైగర్ సినిమాతో ప్లాన్ ను మూట గట్టుకున్న ఈస్టార్ హీరో.. ప్రస్తుతం ఖుషీ సినిమాతో బిజీగా ఉన్నాడు. నెక్ట్స్ సుకుమార్ తో విజయ్ సినిమా చేయాల్సి ఉంది.