బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ షో చివరి దశకు చేరుకుంది. ఇక వారం రోజులే మిగిలి ఉంది. ఇన్ని రోజుల గేమ్‌ ఓ ఎత్తైతే, ఈ వారం రోజుల గేమ్‌ మరో ఎత్తు. ప్రస్తుతం ఐదుగురు కంటెస్టెంట్లు అభిజిత్‌, అఖిల్‌, సోహైల్‌, హారిక, అరియానా ఉన్నారు. ఇక వీరిలో టైటిల్‌ విన్నింగ్‌ పోటీ సోహైల్‌, అభిజిత్‌ మధ్యే ఉంటుందని అంటున్నారు. చాలా మంది ప్రముఖులు అభిజిత్‌, సోహైల్‌ పేర్లు చెప్పారు. 

తాజాగా రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ స్పందించారు. ఈ సీజన్‌లో తన ఓటు ఎవరికో చెప్పేశాడు. అతనికి భారీగా ప్రమోషన్‌ తీసుకొచ్చారు. ఆయన మరెవరో కాదు అభిజిత్‌. అభిజిత్‌కి నా ఓటు అని చెప్పారు విజయ్‌. అభిజిత్‌కి బెస్ట్  ఆఫ్‌ లక్‌ తెలిపారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఓ ఫోటోని పంచుకున్నాడు. ఇందులో అభిజిత్‌, విజయ్‌ దేవరకొండ, సుధాకర్‌ కోమాకుల, వంటి వారున్నారు. 

వీరింతా కలిసి `లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌` చిత్రంలో నటించారు. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన చిత్రమిది. ఇందులో అభిజిత్‌ మెయిన్‌ హీరోగా కనిపించారు. విజయ్‌ నెగటివ్‌ షేడ్‌ ఉన్న పాత్రలో నటించాడు. ఆ సినిమా విజయ్‌కి పెద్దగా పేరు తీసుకురాలేకపోయింది. అయితే ఈ ఫోటోని పంచుకుంటూ , `మై బాయ్స్.. ఎల్లప్పుడు వారికి శుభాకాంక్షలు..ఎక్కడైనా, ఏదైనా.. `అని పేర్కొన్నాడు విజయ్‌. అభిజిత్‌కి విజయ్‌ మద్దతు భారీగా ఓట్లు వేసేలా చేస్తుందని అంటున్నారు. మరి ఈ సీజన్‌ విన్నర్‌ ఎవరో తెలియాలంటే వారం రోజులు ఆగాల్సిందే.