విజయ్‌ దేవరకొండ తన బర్త్ డే సందర్భంగా ఫ్యాన్‌ని నిరాశకి గురి చేశారు. నేడు(మే9) తన బర్త్ డే. ఈ సందర్భంగా ఆయన కొత్త సినిమాకి సంబంధించి ట్రీట్‌ వస్తుందని భావించిన ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు చల్లాడు.

విజయ్‌ దేవరకొండ తన బర్త్ డే సందర్భంగా ఫ్యాన్‌ని నిరాశకి గురి చేశారు. నేడు(మే9) తన బర్త్ డే. ఈ సందర్భంగా ఆయన కొత్త సినిమాకి సంబంధించి ట్రీట్‌ వస్తుందని భావించిన ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు చల్లాడు. తాను ప్రస్తుతం `లైగర్‌` చిత్రంలో నటిస్తున్నారు. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. తెలుగు, హిందీలో పాన్‌ ఇండియా చిత్రంగా రూపొందుతుంది. పూరీ జగన్నాథ్‌, ఛార్మి, కరణ్‌జోహార్‌ నిర్మిస్తున్నారు. బాక్సింగ్‌ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది. కరోనా వల్ల ప్రస్తుతం షూటింగ్‌ ఆగిపోయింది. 

ఇదిలా ఉంటే నేడు విజయ్‌ దేవరకొండ బర్త్ డే సందర్భంగా `లైగర్‌` చిత్రానికి సంబంధించి టీజర్‌ని విడుదల చేయాలని యూనిట్‌ భావించింది. గతంలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు కూడా. కానీ ప్రస్తుతం దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది. షూటింగ్‌లు, థియేటర్లన్నీ ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో `లైగర్‌` టీజర్‌ విడుదల చేయడం సరైనది కాదని భావించిన యూనిట్‌ టీజర్‌ని వాయిదా వేశారు. 

ఈ టీజర్‌ మాత్రం పవర్‌ ప్యాక్డ్ గా ఉంటుందని, కచ్చితంగా డిజప్పాయింట్‌ చేయదని, గతంలో ఎప్పుడూ చూడని కొత్త అవతారంలో విజయ్‌ కనిపిస్తారని చెప్పింది. కరోనా వేళ ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండండి అని, కరోనా జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. వ్యాక్సిన్‌ చేయించుకోమని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని చెప్పారు. పరిస్థితులు సెట్‌ అయ్యాక టీజర్‌ని విడుదల చేస్తామని, అలాగే సినిమాని థియేటర్‌లోకి తీసుకొస్తామని చెప్పారు. ఇందులో బాలీవుడ్‌ నటి అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే.

Scroll to load tweet…