విజయ్ దేవరకొండ వినాయక చవితి స్పెషల్.. `లైగర్` రిలీజ్ డేట్ ఫిక్స్
విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం `లైగర్`. `సాలాక్రాస్ బ్రీడ్` అనేది ట్యాగ్‌లైన్. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ పతాకాలపై తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రూపొందుతుంది. తాజాగా రిలీజ్ డేట్ కన్ఫమ్ చేశారు.
విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం `లైగర్`. `సాలాక్రాస్ బ్రీడ్` అనేది ట్యాగ్‌లైన్. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ పతాకాలపై తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రూపొందుతుంది. కరణ్ జోహార్, ఛార్మీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌తోపాటు విడుదల తేదీని ప్రకటించారు. సెప్టెంబర్ 9న థియేటర్లో విడుదల చేయనున్నట్టు ప్రకటించింది యూనిట్. వినాయక చవితి స్పెషల్‌గా దీన్ని విడుదల చేయనున్నారు.
బాక్సింగ్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు పూరీ జగన్నాథ్. ఈ సినిమా కోసం విజయ్ బాడీ ఫిట్‌నెస్‌పై చాలా ఫోకస్ చేశారు. కఠోరంగా శ్రమించారు. క్రీడాకారుడి దేహాన్ని, ఫిట్‌నెస్‌ని పొందాడు. అందుకు సంబంధించి జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియోలను కూడా పంచుకున్న విషయం తెలిసిందే. ఇందులో అనన్య పాండే విజయ్ సరసన హీరోయిన్‌గా నటిస్తుంది. వరుసగా పరాజయాలతో ఉన్న విజయ్ ఈ సినిమాతో హిట్ కొట్టాలని, పాన్ ఇండియా స్టార్‌గా ఎదగాలని కసితో ఉన్నారు. మరి అది ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.