ముప్పై రోజుల్లోపే లైగర్ ఓటీటీలోకి వచ్చేసింది. దీంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రస్తుతం లైగర్ స్ట్రీమ్ అవుతుంది.  

ఈ మధ్య కాలంలో భారీ హైప్ మధ్య విడుదలైన చిత్రాల్లో లైగర్ ఒకటి. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ మ్యాజిక్ చేస్తాడని భావిస్తే ఉసూరుమనిపించారు. ఫస్ట్ షో నుండే లైగర్ డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఓపెనింగ్స్ పర్వాలేదు అనిపించినా సెకండ్ డే నుండి కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. కేవలం 30-40 శాతం మాత్రమే లైగర్ రికవరీ చేసింది. భారీ ధరకు లైగర్ హక్కులు దక్కించుకున్న బయ్యర్లు పెద్ద ఎత్తున నష్టపోయారు. 

ఇక లైగర్ థియేట్రికల్ రన్ ముగిసిన నేపథ్యంలో లైగర్ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో లైగర్ ప్రస్తుతం స్ట్రీమ్ అవుతుంది. మూవీ విడుదలై నెల రోజులు కాకునుండానే మేకర్స్ ఓటీటీలో అందుబాటులోకి తెచ్చారు. ఇటీవల చిత్ర పరిశ్రమ దెబ్బతినడానికి ఓటీటీనే కారణమని నిర్మాతల మండలి నిర్ణయానికి వచ్చారు. కొత్త చిత్రాలు వారాల వ్యవధిలో ఓటీటీలో అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో థియేటర్స్ కి ప్రేక్షకులు రావడం లేదని తేల్చారు. 

View post on Instagram

దీనికి పరిష్కారంగా పెద్ద చిత్రాలు విడుదలైన వంద రోజుల తర్వాతే ఓటీటీలో విడుదల చేయాలని తీర్మానం చేశారు. ఈ నిబంధనలను ఎవరూ పట్టించుకున్న దాఖలాలు లేవు. లైగర్ డిజాస్టర్ కావడంతో నెల రోజులు గడవకుండానే ఓటీటీలో విడుదల చేశారు లైగర్ ఆగస్టు 25న విడుదలైన విషయం తెలిసిందే. పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ లో లైగర్ చిత్రాన్ని నిర్మించారు. విజయ్ దేవరకొండ ప్రొఫెషనల్ ఫైటర్ రోల్ చేశారు. అనన్య పాండే హీరోయిన్ గా నటించారు. రమ్యకృష్ణ కీలక రోల్ చేశారు. కాగా మాజీ వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్ మైక్ టైసన్ చిన్న క్యామియో రోల్ చేశారు.