విజయ్ దేవరకొండ, నీహారిక పెళ్లి చేసుకోబోతున్నారని ఆ కారణంతోనే విజయ్ కి మెగా కాంపౌండ్ లో ఎక్కువ రెస్పెక్ట్ దక్కుతుందని, అతడి సినిమా ప్రమోషన్స్ కి బన్నీ లాంటి స్టార్లు వస్తున్నారని రకరకాల వార్తల ప్రచారం చేశారు.

అయితే వాటన్నింటికీ దిమ్మతిరిగే సమాధానమిచ్చాడు విజయ్ దేవరకొండ. నీహారిక తనకు చెల్లెలు అంటూ ప్రకటించాడు. అసలు విషయంలోకి వస్తే.. నీహారిక ప్రధాన పాత్రలో నటించిన 'సూర్యకాంతం' సినిమా ఈ వారంలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి విజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.

ఈ సందర్భంగా విజయ్.. నాగబాబు తనకు తండ్రిలా కనిపిస్తారని.. నీహారికకు తను బిగ్ బ్రదర్ అంటూ మాట్లాడాడు. నాగబాబుకి కొడుకుగా, నీహారికకి బ్రదర్ గా.. బిగ్ బ్రదర్ గా డ్యూటీ చేస్తున్నా.. చాలా గర్వంగా ఉందంటూ మెగాఫ్యాన్స్ ని తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేశాడు.

ప్రస్తుతం నాగబాబు పొలిటికల్ గా బిజీ అయ్యారని, వరుణ్ తేజ్, రామ్ చరణ్ లు కూడా బిజీగా ఉండడం రాలేకపోయారని క్లారిటీ ఇచ్చాడు. మొత్తానికి విజయ్.. నీహారిక తనకు చెల్లెలు అంటూ ప్రకటించి తనపై వస్తున్న  పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టేశాడు.