‘గీతగోవిందం’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ, పరశురాం కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న రెండో చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’.
విజయ్ దేవరకొండ తన కెరీర్ లో కొత్త డైరక్టర్స్ కు బాగానే అవకాశం ఇచ్చాడు. పెళ్లి చూపులుతో తరుణ్ భాస్కర్, సందీప్ రెడ్డి వంగాతో అర్జున్ రెడ్డి ..అలా ఎప్పటికప్పుడు కొత్త డైరక్టర్స్ తో తీసి హిట్ కొడుతూనే ఉన్నాడు. అంతెందుకు టాక్సీవాలా, డియర్ కామ్రేడ్ సినిమాలు కూడా కొత్త దర్శకులు తెరకెక్కించినవే. ఈ రెండు చిత్రాలకు కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అంతెందుకు అప్పటిదాకా చిన్న చిన్న క్యారెక్టర్ లు చేస్తూ వచ్చిన విజయ్.. నాని ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాలో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా నటించి మంచి గుర్తింపుని సంపాదించుకున్నారు.ఆ సినిమా దర్శకుడు నాగ్ అశ్విన్ ...కొత్త డైరక్టరే. అయితే ఇప్పుడు ఇక కొత్త డైరక్టర్స్ కు నో ఎంట్రీ బోర్డ్ పెట్టేస్తున్నాడు. ఆ విషయమై విజయ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
‘గీతగోవిందం’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ, పరశురాం కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న రెండో చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించాడు. మే 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేది దగ్గరపడడంతో ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచారు మేకర్స్. ఒకపక్క దిల్ రాజు, మరోపక్క విజయ్..ఇద్దరు సినిమా ప్రచారంలో బీజీ అయ్యారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం విజయ్ దేవరకొండ..కొత్త డైరక్టర్స్ గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసారు.
“మొదటి సినిమా డైరెక్ట్ చేసే వ్యక్తికి అన్ని క్రాఫ్ట్స్ పై అవగాహన ఉండదు. కొన్నిసార్లు అది సినిమా లాస్ కి దారి తీస్తుంది. అప్పుడు నిర్మాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి కొత్తవారితో ప్రయోగాలు చేసి నిర్మాతలకు ఇబ్బంది కలిగించకూడదు. ఎవరైనా కొత్త దర్శకుడు కేవలం ఒక సినిమా తీసినా సరే అవగాహన ఉంటే ఛాన్స్ ఇస్తారు. ఆ సినిమా ప్లాప్ అయినా హిట్ అయినా నాకు సంబంధం లేదు. కానీ ఆ సినిమాలోని ఎడిటింగ్, మ్యూజిక్, స్క్రీన్ ప్లే ఏది నన్ను ఆకట్టుకున్నా.. ఆ డైరెక్టర్ కి రెండో అవకాశం నేను ఇస్తాను” అంటూ విజయ్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
ఇక ఈ కామెంట్స్ పై పలువురు పలు విధాలుగా కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. విజయ్ దేవరకొండ తన గతంలో హిట్ ఇచ్చింది కొత్త డైరక్టర్స్ అని మర్చిపోయాడని అంటున్నారు. మరికొందరు అయితే ఇలా అనటానికి కారణం విజయ్ ని కంటిన్యూగా కొత్త డైరక్టర్స్ ఎప్రోచ్ అవటమే అని ,అందుకే ఇలా డైరక్ట్ గా చెప్పి కొద్ది కాలం కొత్త డైరక్టర్స్ కు గ్యాప్ ఇద్దామనుకుంటున్నట్లు చెప్తున్నారు.
ఇక విజయ్‌కి ఫ్యామిలిస్టార్ సినిమా విజయం చాలా అవసరం. అందుకే ప్రమోషన్స్ విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్నాడు. తన తోటి హీరోలా సహాయం కూడా తీసుకుంటున్నాడు. ఏప్రిల్ 2న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ ఈవెంట్‌కి మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా రాబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం విజయ్ చేస్తున్న ప్రచారం చూస్తుంటే.. సినిమాపై బాగా నమ్మకం పెట్టుకున్నారని, ఖచ్చితంగా సూపర్ హిట్ కొడతారని అనిపిస్తోంది.
