మజిలీ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత, విజయ్ దేవరకొండ జంటగానటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం ప్రారంభం అయింది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 

రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన సమంత నటించబోతున్నట్లు చాలా కాలం నుంచి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆ వార్తలు నిజమయ్యాయి. మజిలీ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత, విజయ్ దేవరకొండ జంటగానటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం ప్రారంభం అయింది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 

విజయ్ దేవరకొండ, సమంతలది క్రేజీ కాంబినేషన్. వీరిద్దరూ తొలిసారి మహానటి చిత్రంలో కలసి నటించారు. ఇప్పుడు వీరిద్దరూ కలసి నటిస్తున్న పూర్తి స్థాయి చిత్రం ఇదే. నేడు విజయ్ దేవరకొండ తన 33వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాడు. 

దీనితో నేడు VD11 కి సంబంధించిన ఫస్ట్ లుక్ లాంటిది ఏమైనా ఉంటుందా అని ఫ్యాన్స్ ఆశించారు. కానీ అలాంటి సర్ ప్రైజ్ ఏమి లేదు. తన బర్త్ డే రోజున ఫస్ట్ లుక్ రిలీజ్ చేయవద్దు అంటూ స్వయంగా టీంకి విజయ్ దేవరకొండ సూచించారట. ఈ విషయాన్ని స్వయంగా చిత్ర యూనిట్ రివీల్ చేసింది. 

ఫస్ట్ లుక్ ని మే 16న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఫస్ట్ లుక్ టెరిఫిక్ గా ఉండబోతున్నట్లు అంచనాలు పెంచేసారు. ఇదిలా ఉండగా ఈ చిత్ర సెట్స్ లో విజయ్ దేవరకొండ బర్త్ డే సెలెబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. ఈ సెలెబ్రేషన్స్ లో సమంత కూడా పాల్గొంది. ప్రస్తుతం ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

శివ నిర్వాణ చివరగా తెరకెక్కించిన టక్ జగదీష్ చిత్రం నిరాశపరిచింది. దీనితో ఈ చిత్రంలో మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి ఎక్కాలని ప్రయత్నిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత ఇప్పటికే మజిలీ చిత్రంలో నటించింది. 

Scroll to load tweet…