రౌడీ హీరో విజయ్ దేవరకొండ సినిమా నిర్మాణంలోకి కూడా దిగాడు. తనకు పెళ్లి చూపులు చిత్రంతో విజయం అందించిన దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఆ చిత్ర టైటిల్ 'మీకు మాత్రమే చెప్తా'. షమీర్ సుల్తాన్ ఈ చిత్రానికి దర్శకుడు. 

వాణి భోజన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.  తాజాగా ఈ చిత్ర టీజర్ లాంచ్ చేసారు. టీజర్ చూస్తుంటే ఈ చిత్రం రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కినట్లుంది. తరుణ్ భాస్కర్ ఈ చిత్రంలో తన గర్ల్ ఫ్రెండ్ కి అబద్దాలు చెబుతూ ఇబ్బందులు ఎదుర్కొనే వ్యక్తిగా నటిస్తున్నాడు. 

నీకు సిగరెట్, డ్రింకింగ్, అమ్మాయిలు లాంటి చెడు అలవాట్లు ఉన్నాయా  అని తన గర్ల్ ఫ్రెండ్ గా నటిస్తున్న వాణి భోజన్ ప్రశ్నిస్తుంది. దానికి తరుణ్ భాస్కర్ తడబడుతూ అలాంటి అలవాట్లేవి లేవని అబద్దాలు చెప్పడం ఫన్నీగా ఉంది. 

ఇక అనసూయ కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. శివ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, గుణదేవ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. చూడాలి ఈ చిత్రం విడుదలయ్యాక ఎలా మెప్పిస్తుందో.