'ది రౌడీ'.. 'ది పాలిటీషియన్'.. విజయ్ దేవరకొండ!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 5, Sep 2018, 4:42 PM IST
Vijay Devarakonda's NOTA Sneak Peek
Highlights

టాలీవుడ్ లో సెన్సేషనల్ హీరోగా మారిపోయాడు విజయ్ దేవరకొండ. యూత్ లో అతడి క్రేజ్ రోజురోజుకి పెరిగిపోతుంది. వరుస విజయాలతో ఎంటర్టైన్ చేస్తోన్న విజయ్ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు.. అదే 'నోటా'

టాలీవుడ్ లో సెన్సేషనల్ హీరోగా మారిపోయాడు విజయ్ దేవరకొండ. యూత్ లో అతడి క్రేజ్ రోజురోజుకి పెరిగిపోతుంది. వరుస విజయాలతో ఎంటర్టైన్ చేస్తోన్న విజయ్ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు.. అదే 'నోటా'.

కెరీర్ ఆరంభంలోనే రాజకీయనాయకుడి పాత్రలో కనిపించే సాహసం చేస్తున్నాడు విజయ్. ఇప్పటికే విడుదలైన సినిమా ఫస్ట్ లుక్ లో రాజకీయనాయకుడిగా విజయ్ ఆకట్టుకున్నాడు. రేపు ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా చిత్రబృందం ముప్పై సెకన్ల స్నీక్ పీక్ వీడియో విడుదల చేసింది. ఇందులో అమ్మాయిలు ఎంజాయ్మెంట్ అంటూ తిరిగే ఒక యువకుడు బాధ్యత గల పాలిటీషియన్ గా మారడం చూపించారు.

రాజకీయనాయకుడిగా విజయ్ గెటప్, అతడి హావభావాలు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. డైలాగ్స్ లేకుండానే ఈ వీడియో ఇంత ఇంపాక్ట్ చూపిస్తుందంటే రెండున్నర గంటల సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో మరి. ఆనంద్ శంకర్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా కోసం విజయ్ తమిళ భాష నేర్చుకొని మరీ డబ్బింగ్ చెప్పాడు. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మెహ్రీన్ హీరోయిన్ గా కనిపించనుంది. వచ్చే నెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 

loader