లైఫ్ ఆర్ డెత్ గేమ్ లో విజయ్ దేవరకొండ.. 'నోటా' ట్రైలర్!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 6, Sep 2018, 4:25 PM IST
vijay devarakonda's nota movie trailer
Highlights

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'నోటా'. ఆనంద్ శంకర్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'నోటా'. ఆనంద్ శంకర్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది చిత్రబృందం.

కొన్ని కారణాల వలన రాజకీయనాయకుడిగా ఎలాంటి అనుభవం లేని విజయ్ దేవరకొండ ముఖ్యమంత్రిగా మారాల్సివస్తుంది. ఆ తరువాత అతడి కారణంగా సొంత పార్టీలోనే అభిప్రాయబేధాలు వస్తుంటాయని ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. నాజర్, సత్యరాజ్ వంటి సీనియర్ నటులు రాజకీయాల్లో ఆరితేరిన వ్యక్తులుగా కనిపించనున్నారు. ''ఒక స్టేట్ ఫ్యూచర్ అంతా స్వామిజీ చేతిలోనా..?'' అంటూ విజయ్ దేవరకొండ రాజకీయనాయకుల్ని ప్రశ్నించే డైలాగ్ ఆకట్టుకుంటుంది. 

రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ ని ఉద్దేశిస్తూ బ్యాక్ గ్రౌండ్ లో సత్యరాజ్ చెప్పే ''ఈ గేమ్ లో నువ్ చూసే రక్తం నిజం.. నీ శత్రువులు నిజం.. ఆడడం మొదలుపెట్టావో.. ఆపడం నీ చేతుల్లో లేదు.. లైఫ్ ఆర్ డెత్'' అనే డైలాగ్ ట్రైలర్ మొత్తానికి హైలైట్ గా నిలిచింది. నేపధ్య సంగీత ట్రైలర్ కి మరో అదనపు ఆకర్షణగా నిలిచింది. మెహ్రీన్ రిపోర్టర్ పాత్రలో కనిపించనుంది. మరి ఈ రాజకీయ ఆటలతో విజయ్ దేవరకొండ ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి!

 

loader