టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ కి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. 'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం' చిత్రాలతో తన క్రేజ్ ని మరింతగా పెంచుకున్నాడు. 'గీత గోవిందం' సినిమా వంద కోట్లకు దగ్గరగా వసూళ్లు రాబట్టింది.

అయితే దాని తరువాత వచ్చిన సినిమాలు మాత్రం ఆ మార్క్ ని అందుకోలేకపోయాయి.దీంతో ఇప్పుడు తన రూట్ ని మారుస్తున్నాడు విజయ్ దేవరకొండ. 'డియర్ కామ్రేడ్' సినిమా నుండి కొత్త ప్లాన్ వర్కవుట్ చేస్తున్నాడు. తన సినిమాలకు తెలుగులో యాభై కోట్ల బిజినెస్ జరుగుతోంది. దీనికి దక్షిణాదిలో ఇతర మార్కెట్ లను కూడా జత చేస్తున్నాడు.

అయితే తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విజయ్ చిత్రాలకు వెంటనే కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ లేదు. కానీ మెల్లగా అక్కడ కూడా మార్కెట్ ని విస్తరించుకోవాలని చూస్తున్నారు.  'డియర్ కామ్రేడ్' సినిమాను అన్ని దక్షిణాది భాషల్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

తన తదుపరి చిత్రాలను మల్టిపుల్ లాంగ్వేజెస్ లో విడుదల చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ విధంగా మిగిలిన రాష్ట్రాల్లో కూడా యాభై కోట్ల బిజినెస్ వరకు రీచ్ అయితే తన మార్కెట్ వంద కోట్లకు చేరుకునే ఛాన్స్ ఉంటుంది. గతంలో మన స్టార్ హీరోలు ఈ విధంగా ట్రై చేసినా వర్కవుట్ కాలేదు. మరి విజయ్ కైనా కలిసొస్తుందేమో చూడాలి!