'గీత గోవిందం' తొలివారం కలెక్షన్లు..

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 20, Aug 2018, 1:10 PM IST
vijay devarakonda's geetha govindam movie first week collections
Highlights

మొదటి రోజే పదికోట్లు వసూలు చేసి నిర్మాతలను ఆశ్చర్యపరిచిన 'గీత గోవిందం' లాంగ్ రన్ మరిన్ని వసూళ్లు రాబట్టింది. తొలివారంలో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.53.7 కోట్ల గ్రాస్ ని, రూ.31.65 కోట్ల షేర్ ని రాబట్టింది. 

విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన చిత్రం 'గీత గోవిందం'. పరశురామ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఘాన విజయం సాధించింది. నిన్న జరిగిన సినిమా సక్సెస్ మీట్ లో చిరంజీవి సైతం ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. మొదటి రోజే పదికోట్లు వసూలు చేసి నిర్మాతలను ఆశ్చర్యపరిచిన 'గీత గోవిందం' లాంగ్ రన్ మరిన్ని వసూళ్లు రాబట్టింది.

తొలివారంలో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.53.7 కోట్ల గ్రాస్ ని, రూ.31.65 కోట్ల షేర్ ని రాబట్టింది. రూ.15 కోట్లకు ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ విక్రయించగా.. డిస్ట్రిబ్యూటర్లకు, బయ్యర్లకు భారీ లాభాలు తీసుకొచ్చింది. ఆగస్టు 15న విడుదలైన ఈ సినిమా ఐదు రోజుల్లో రెండు రాష్ట్రాల్లో కలిపి రూ.33 కోట్ల గ్రాస్ ని వసూలు చేసినట్లు ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

కర్ణాటకలో ఈ సినిమా రూ.5 కోట్లు గ్రాస్ రాబట్టింది. ఒక్క ఇండియాలోనే రూ.40 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం విశేషం. ఇక ఓవర్సీస్ లో ఈ సినిమా మిలియన్ డాలర్ క్లబ్ లో చేరడంతో పాటు ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు సాధించిన తెలుగు సినిమాల జాబితాలో స్థానం దక్కించుకుంది.   

ఇవి కూడా చదవండి..

 విజయాన్ని తల దగ్గర కాకుండా గుండెల్లో పెట్టుకోవాలి.. విజయ్ కి చిరు సలహా!

'గీత గోవిందం' పై విజయ్ కి నమ్మకం లేదా..?
 

loader