'గీత గోవిందం' పై విజయ్ కి నమ్మకం లేదా..?

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 19, Aug 2018, 11:41 AM IST
geetha govindam unexpected hit for vijay devarakonda
Highlights

హీరో విజయ్ దేవరకొండ నటించిన 'గీత గోవిందం' సినిమా రీసెంట్ గా విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అయితే ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అవుతుందని విజయ్ దేవరకొండ ఊహించలేదట

హీరో విజయ్ దేవరకొండ నటించిన 'గీత గోవిందం' సినిమా రీసెంట్ గా విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అయితే ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అవుతుందని విజయ్ దేవరకొండ ఊహించలేదట. అందుకే 'అర్జున్ రెడ్డి' సినిమా తరువాత 'టాక్సీవాలా' సినిమా రిలీజ్ చేయాలని పట్టుబట్టాడట. ఆ సినిమాపై నమ్మకంతో ఓవర్సీస్ హక్కులు కూడా తనే తీసుకున్నాడు.

అయితే టాక్సీవాలా గ్రాఫిక్స్ పనులు పూర్తి కాకపోవడంతో గీత గోవిందం సినిమా విడుదల చేయాలని మేకర్స్ విజయ్ కి చెప్పినప్పుడు తను అంగీకరించలేదట. బలవంతంగా విజయ్ ని ఒప్పించినట్లు సమాచారం. విజయ్ ఫ్యామిలీ రిలీజ్ కి ముందు సినిమా చూసి పర్వాలేదు అన్న తరువాతే విజయ్ రిలీజ్ కి ఒప్పుకున్నాడట. సినిమాకు ఓ మాదిరి రేటింగ్స్ రావొచ్చని నిర్మాతలు కూడా అనుకున్నారు.

కానీ ఇప్పుడు ఊహించని విధంగా సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఈ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ముందుగానే సినిమా శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్ కలిపి 5.20 కోట్లకు అమ్మేశారు. రిలీజ్ అయిన తరువాత అమ్మి ఉంటే మరో మంచి నెంబర్ వచ్చి ఉండేది. 

loader