అర్జున్ రెడ్డి తమ్ముడు రెడీ అవుతున్నాడు!

vijay devarakonda's brother anand devarakonda to debut as a heero
Highlights

'పెళ్లిచూపులు' చిత్రంతో హీరోగా పరిచయమయిన విజయ్ దేవరకొండ 'అర్జున్ రెడ్డి'

'పెళ్లిచూపులు' చిత్రంతో హీరోగా పరిచయమయిన విజయ్ దేవరకొండ 'అర్జున్ రెడ్డి' చిత్రంతో సెన్సేషనల్ హీరోగా మారిపోయాడు. స్టార్ హోదా రావడంతో వరుస ఆఫర్లు అతడ్ని చుట్టుముడుతున్నాయి. యూత్ లో అతడికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతి తక్కువ సమయంలో విజయ్ దేవరకొండ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు ఈ క్రేజ్ ను తన తమ్ముడు కోసం వాడుతున్నట్లు సమాచారం.

విజయ్ కు ఆనంద్ దేవరకొండ అనే తమ్ముడు ఉన్నాడు. ఇప్పుడు ఆనంద్ ను హీరోగా పరిచయం చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దీనికోసం ఆనంద్ అప్పుడే జిమ్ లో వర్కవుట్లు చేస్తున్నాడట. తన బాడీ ఫిట్ నెస్ తో పాటు పలు రకాల ఫిలిం క్రాఫ్ట్స్ లో కూడా శిక్షణ తీసుకుంటున్నాడని సమాచారం. విజయ్ దేవరకొండకు సన్నిహితులైన ఓ నిర్మాణ సంస్థ ఆనంద్ ను పరిచయం చేయడానికి సిద్ధమవుతోంది. మరి నటుడిగా ఆనంద్ దేవరకొండ ఎంతవరకు గుర్తింపు పొందుతాడో చూడాలి!

loader