పెళ్లిచూపులు' సినిమా తరువాత విజయ్ దేవరకొండతో కలిసి సినిమా చేయాలనుకున్నాడట పరశురామ్. అదే 'గీత గోవిందం'. ఈ కథ చాలా మంది హీరోయిన్లకు చెప్పాడట. అయితే ఆ సమయంలో విజయ్ దేవరకొండకి సరైన గుర్తింపు లేకపోవడంతో దాదాపు 25 మంది హీరోయిన్లు అతడిని రిజెక్ట్ చేశారట.
సినిమా ఇండస్ట్రీలో నటులుగా గుర్తింపు తెచ్చుకోవడం చాలా కష్టం. ఒక్కసారి బ్రేక్ వచ్చిందంటే ఇక దర్శకనిర్మాతలు వాటి వెంటే పడుతుంటారు. ఇక హీరోయిన్లు క్రేజ్ లేని హీరోలతో కలిసి నటించడానికి పెద్దగా ఆసక్తి చూపరు. స్టార్ హీరోయిన్లు రెమ్యునరేషన్, పెద్ద బ్యానర్ ఇలా చాలా విషయాల్లో ఆచితూచి అడుగులు వేస్తుంటారు. కుర్ర హీరోలతో, అప్ కమింగ్ హీరోలతో సినిమాలు చేసే ఆలోచనలు కూడా చేయరు.
ఆ కారణంగానే విజయ్ దేవరకొండని పాతిక మంది హీరోయిన్లు రిజెక్ట్ చేశారంట. 'పెళ్లిచూపులు' సినిమా సక్సెస్ అయినప్పటికీ విజయ్ కి పెద్దగా క్రేజ్ ఏర్పడలేదు. 'అర్జున్ రెడ్డి' చిత్రంతో స్టార్ డమ్ సంపాదించుకున్నాడు. అయితే 'పెళ్లిచూపులు' సినిమా తరువాత విజయ్ దేవరకొండతో కలిసి సినిమా చేయాలనుకున్నాడట పరశురామ్. అదే 'గీత గోవిందం'. ఈ కథ చాలా మంది హీరోయిన్లకు చెప్పాడట.
అయితే ఆ సమయంలో విజయ్ దేవరకొండకి సరైన గుర్తింపు లేకపోవడంతో దాదాపు 25 మంది హీరోయిన్లు అతడిని రిజెక్ట్ చేశారట. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు పరశురామ్ వెల్లడించడం విశేషం. ఆ కథలో రష్మిక హీరోయిన్ గా నటించి మొత్తం క్రేజ్ కొట్టేసింది. విజయ్ ఖాతాలో మరో హిట్టు కూడా పడింది. తన తదుపరి సినిమాలో రాశిఖన్నా వంటి స్టార్ హీరోయిన్ తో ఈ యంగ్ హీరో రొమాన్స్ చేయబోతున్నాడని సమాచారం!
