విజయ్ దేవరకొండ హీరోగా పట్టుమని పదిసినిమాలు చేయలేదు. అయినప్పటికీ రెండు మూడు చిత్రాలు విజయ్ దేవరకొండ ఇమేజ్ ఎక్కడికో తీసుకెళ్లాయి. ముఖ్యంగా అర్జున్ రెడ్డి మూవీ విజయ్ దేవరకొండను ఓవర్ నైట్ స్టార్ గా మార్చేసింది.
టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)కు చాలా ముద్దు పేర్లు ఉన్నాయి అయితే ఎక్కువగా రౌడీ హీరో అని పిలుచుకుంటారు అభిమానులు. కెరీర్ లో విజయ్ దేవరకొండ ఎదిగిన తీరు అద్భుతం. చిన్నా చితకా పాత్రలతో మొదలై స్టార్ హీరో రేంజ్ కి వచ్చేశాడు. టాలీవుడ్ టాప్ స్టార్స్ లిస్ట్ లో ఇప్పుడు విజయ్ దేవరకొండను చేర్చాల్సిందే. అందుకు తాజాగా పరిణామాలే కారణం. విజయ్ దేవరకొండలో ఏదో ప్రత్యేకత ఉంది. అదే అతన్ని స్టార్ గా మార్చింది. ఆన్ స్క్రీన్ తో పాటు ఆఫ్ స్క్రీన్ లో కూడా విజయ్ సపరేట్ మేనరిజం, యాటిట్యూడ్ చూపిస్తాడు. ఇది విజయ్ దేవరకొండను ఇతర హీరోల నుండి వేరు చేసింది.
విజయ్ దేవరకొండ హీరోగా పట్టుమని పదిసినిమాలు చేయలేదు. అయినప్పటికీ రెండు మూడు చిత్రాలు విజయ్ దేవరకొండ ఇమేజ్ ఎక్కడికో తీసుకెళ్లాయి. ముఖ్యంగా అర్జున్ రెడ్డి మూవీ విజయ్ దేవరకొండను ఓవర్ నైట్ స్టార్ గా మార్చేసింది. ఇక గీత గోవిందం మూవీతో క్లాస్ ఆడియన్స్ తో పాటు అమ్మాయిల హాట్ ఫేవరేట్ గా విజయ్ దేవరకొండ మారిపోయాడు. ఇంత తక్కువ వ్యవధిలో పాన్ ఇండియా మూవీ చేసే అవకాశం రావడం కూడా అరుదైన విషయమే.
భీభత్సమైన బ్యాక్ అప్, గాడ్ ఫాదర్స్ ఉన్న స్టార్స్ కిడ్స్ కుళ్ళుకునేలా విజయ్ దేవరకొండ స్టార్ డమ్ చేరుకుంది. వారికి సాధ్యం కానిది విజయ్ దేవరకొండ చేసి చూపిస్తున్నాడు. ఇక తాజా పరిణామంతో లెక్కలన్నీ మారిపోయాయి.ప్రముఖ శీతల పానీయం థమ్స్ అప్ ప్రచారకర్తగా విజయ్ దేవరకొండ మారారు. ఆయన సూపర్ స్టార్ మహేష్ స్థానం భర్తీ చేస్తూ ఈ ప్రోడక్ట్ అంబాసర్ బాధ్యతలు చేపట్టారు. మహేష్ రేంజ్ హీరోకి ప్రత్యామ్నాయంగా విజయ్ దేవరకొండ మారడం అనూహ్యం. ఎన్టీఆర్(NTR), ప్రభాస్, అల్లు అర్జున్(Allu Arjun), రామ్ చరణ్ లాంటి బడా స్టార్స్ ని కూడా కాదని సదరు సంస్థ విజయ్ దేవరకొండను ఎంచుకుంది.
ఒకప్పుడు చిరంజీవి, తర్వాత మహేష్ (Mahesh)వంటి టాప్ స్టార్స్ మాత్రమే థంమ్స్ అప్ ప్రోడక్ట్ ప్రచారకర్తలుగా ఉన్నారు. 200 దేశాలకు పైగా వ్యాపారం నిర్వహిస్తున్న కోకా కోలా ఉత్పత్తుల్లో థంమ్స్ అప్ ఒకటి. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండకు స్టార్ ట్యాగ్ తగిలించేయాల్సిందే అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మెగాస్టార్, సూపర్ స్టార్, పవర్ స్టార్ లాగా... విజయ్ దేవరకొండ పేరు ముందు ఓ బిరుదు ఉండాలి. దానికి విజయ్ దేవరకొండ అన్ని విధాలా అర్హుడే అని చెప్పాలి.
