'నువ్విలా' చిత్రంలో చిన్న రోల్ చేసిన విజయ్ దేవరకొండ ఆ తరువాత 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' సినిమాలో నటించాడు. 'ఎవడే సుబ్రహ్మణ్యం' చిత్రంతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

'నువ్విలా' చిత్రంలో చిన్న రోల్ చేసిన విజయ్ దేవరకొండ ఆ తరువాత 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' సినిమాలో నటించాడు. 'ఎవడే సుబ్రహ్మణ్యం' చిత్రంతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

'పెళ్లిచూపులు' చిత్రంతో హీరోగా బ్రేక్ రావడం, ఆ తరువాత 'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం' అంటూ వరుసగా సక్సెస్ లు అందుకున్న ఈ హీరో తాజాగా ఫోర్బ్స్ లిస్ట్ లో చోటు దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా విజయ్ అభిమానులతో ఓ విషయాన్ని పంచుకున్నాడు.

''నాకు 25 ఏళ్ల వయసున్నప్పుడు రూ.500మినిమం బ్యాలన్స్ మైంటైన్ చేయకపోతే అకౌంట్ లాక్ చేసిన్రు.. అప్పుడు నాన్న ముప్పై వచ్చేలోపు బాగా సెటిల్ కావాలని, తల్లితండ్రులు ఆరోగ్యంగా ఉన్నప్పుడు, యువకుడిగా ఉన్నప్పుడే సక్సెస్ ని ఎంజాయ్ చేయగలవని అన్నారు.

నాలుగేళ్ల తరువాత ఫోర్బ్స్ సెలబ్రిటీల స్థానంలో చోటు సంపాదించాను'' అంటూ పోస్ట్ పెట్టాడు. దీనికి విజయ్ అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం విజయ్ 'డియర్ కామ్రేడ్' సినిమాలో నటిస్తున్నాడు.

Scroll to load tweet…