టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తన సినిమాల విషయంలో అతి జాగ్రత్తలు తీసుకుంటాడని చెబుతుంటారు. 'డియర్ కామ్రేడ్' సినిమా విషయంలో క్రియేటివ్ సైడ్ కూడా విజయ్ ఇన్వాల్వ్ అయ్యాడని, దర్శకుడు భరత్ ని పని చేయనివ్వకుండా తనకు నచ్చినట్లుగా చాలా సీన్లు తీశాడని, రీషూట్లు కూడా చేసి దర్శకుడి విజన్ ని చెడగొట్టాడని 
అప్పట్లో గుసగుసలు వినిపించాయి.

అలానే తన సినిమాను ఎలా ప్రమోట్ చేస్తే జనాల్లోకి వెళ్తుందనే విషయంపై కూడా విజయ్ కి స్పష్టమనే అవగాహన ఉంటుంది. ఇంతవరకు తన సినిమాలను తనే ప్రమోట్  చేసుకున్నాడు. కానీ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో చేస్తోన్న సినిమా విషయంలో మాత్రం తను ఏ విధంగా కూడా ఇన్వాల్వ్ అవ్వనని చెబుతున్నాడట. 

క్రియేటివ్ విషయాల పరంగా తను వేలు పెట్టనని.. కేవలం షూటింగ్ మాత్రం చేసి పక్కకి తప్పుకుంటానని.. రెగ్యులర్ ప్రమోషన్స్ కి హాజరవుతానని మాత్రం చెప్పాడట. విజయ్ సినిమాలు బహుసా ఫెయిల్ అయి ఉండొచ్చు కానీ అతడి మార్కెటింగ్ స్ట్రాటజీలు మాత్రం ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. అతడు నటించే ప్రతీ సినిమాకి ఓపెనింగ్స్ భారీ 
లెవెల్ లో రావడం వెనుక విజయ్ పాత్ర ఎంతో ఉంది.

మరి ఈసారి అసలు ప్రమోషన్స్ విషయంలో ఐడియాల జోలికి పోనని అంటున్నాడు. మరి క్రాంతిమాధవ్, కెఎస్ రామారావు ఈ సినిమాను ఎలా ప్రమోట్ చేసుకుంటారో చూడాలి. ఈ సినిమాను డిసంబర్ లో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు!