వరుస విజయాలతో మంచి ఉపుమీదున్న టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ కొత్త దర్శకులకు నమ్మడంలో చాలా తెలివిగా ఆలోచిస్తాడు. టాలెంట్ ని పసిగట్టడంలో విజయ్ స్టయిలే వేరు. అదే తరహాలో అలోచించి ఇండస్ట్రీ హిట్స్ అందుకున్న విజయ్ నెక్స్ట్ మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 

అతనెవరో కాదు దొరసాని దర్శకుడు కెవిఆర్.మహేంద్ర. ఆనంద్ దేవరకొండ - శివాత్మిక రాజశేఖర్ నటించిన దొరసాని సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే రీసెంట్ గా సినిమాకు సంబందించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడితో విజయ్ చాలా సేపు చర్చించాడు. 

ఇక ఫైనల్ గా స్టేజ్ పైనే నీతో సినిమా చేయడానికి రెడీ.. స్క్రిప్ట్ ఫినిష్ చెయ్ అని అఫర్ ఇచ్చేశాడు. దొరసాని రిజల్ట్ ఎలా ఉన్నా కూడా ఎలాగైనా నీతో సినిమా చేస్తానని విజయ్ వేడుక అనంతరం మహేంద్రకు మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రౌడీ హీరో క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఇక డియర్ కామ్రేడ్ ఈ నెల 26న రిలీజ్ కానుంది.