వరస సక్సెస్ లతో దూసుకుపోతున్న  సెన్షేషనల్  హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ .  ఆయ‌న న‌టించిన తాజా చిత్రం డియ‌ర్ కామ్రేడ్ చిత్రం జూలై 26న నాలుగు భాష‌ల‌లో విడుద‌ల కానుండ‌గా, హీరో అనే బైలింగ్యువ‌ల్ చిత్రం రీసెంట్ గా లాంచ్ అయింది. అదే సమయంలో  మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు ఫేమ్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. 

ఈ చిత్రంలో విజ‌య్ ముగ్గురు అమ్మాయిల‌ని ప్రేమిస్తార‌ట‌. ముగ్గురితోనూ బ్రేక‌ప్ అవుతుంద‌ట‌. చివ‌ర‌కు ఒక అమ్మాయిని పెళ్ళి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవుతార‌ట‌. జీవితంలో వివిధ దశల్లో తాను కలుసుకున్న అమ్మాయిలను ప్రేమించి ఆ తరువాత బ్రేకప్  బాదితుడిగా మిగిలిపోతాడు కాబట్టే సినిమాకు బ్రేకప్ అనే టైటిల్ బాగుంటుంద‌ని దర్శక,నిర్మాతలు  భావిస్తున్నార‌ు. విభిన్నమైన ప్రేమ కథతో రూపొందుతున్న ఈ చిత్రంలో రొమాంటిక్ డోస్ ఎక్కువ‌గానే ఉంటుంద‌నే టాక్ వినిపిస్తుంది. చిత్రానికి గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు.

క్రియేటివ్ కమర్షియల్ పతాకంపై కె.ఎస్. రామారావు సమర్పకుడిగా వ్యవహరించనున్న ఈ చిత్రానికి కె.ఏ వల్లభ నిర్మాత. రాశీఖన్నా, ఐశ్వర్యరాజేష్, బ్రెజిల్ మోడల్ ఇసాబెల్లె డి, కేథ‌రిన్ థెస్రా హీరోయిన్స్ గా నటిస్తున్నారు.  కొత్త విధానంలో సాగ‌నున్న ఈ చిత్రానికి బ్రేక‌ప్ అనే టైటిల్‌ని ప‌రిశీలిస్తున్నార‌ట‌. 

విజ‌య్ ప్ర‌స్తుతం భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌క‌త్వంలో డియ‌ర్ కామ్రేడ్‌లో న‌టిస్తున్నారు. గీత గోవిందం త‌ర్వాత ర‌ష్మిక మంద‌న్నా ఇందులో విజ‌య్ స‌ర‌స‌న న‌టిస్తుంది. క్రికెట్‌, కాలేజ్ నేప‌థ్యంలో సాగే ఈ సినిమాని జులై 26న విడుద‌ల చేయ‌నున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన రెండు పాట‌లు, టీజ‌ర్ సినిమాపై క్రేజ్‌ని పెంచుతున్నాయి. మ‌రోవైపు త‌మిళ ద‌ర్శ‌కుడు ఆనంద్ అన్నమ‌లై ద‌ర్శ‌క‌త్వంలో స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న హీరో సినిమా ఇటీవ‌లే ప్రారంభ‌మైంది. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించే ఈ సినిమాలో మ‌ల‌యాళ‌ న‌టి మాళ‌విక మోహ‌న‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుంది.