టాలీవుడ్ రౌడీ స్టార్ గా ఒక ఇమేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ నెక్స్ట్ మరో కుర్ర దర్శకుడితో వర్క్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల డియర్ కామ్రేడ్ సినిమాతో విజయ్ అనుకున్నంతగా సక్సెస్ అందుకోలేకపోయాడు. ప్రస్తుతం రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న విజయ్ పూరి జగన్నాథ్ తో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్న విషయం తెలిసిందే. 

ఇక ఇటీవల హుషారు సినిమాతో ఓ వర్గం ఆడియెన్స్ ని ఆకట్టుకున్న యువ దర్శకుడు శ్రీ హర్ష కొనుగంటి తన తదుపరి సినిమాను విజయ్ దేవరకొండతో చేయనున్నట్లు గత కొన్ని వారాలుగా కథనాలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. అయితే మొదట కథపై కాస్త సందేహంగా ఉన్న విజయ్ అనంతరం హర్ష ఫుల్ స్క్రిప్ట్ నరేట్ చేయడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

కానీ విజయ్ ఇప్పట్లో మరో కొత్త సినిమాను స్టార్ట్ చేసే గ్యాప్ లేదు. వచ్చే ఏడాది సమ్మర్ వరకు బిజీగా ఉంటాడు. అయితే హుషారు డైరెక్టర్ మాత్రం  ఎన్ని నెలలైనా వెయిట్ చేస్తానని మరో అఫర్ వచ్చినా ఒప్పుకోలేదట. తన నెక్స్ట్ కథను ఎలాగైనా విజయ్ తోనే చేయాలనీ యువ దర్శకుడు హుషారుగా ఉన్నట్లు తెలుస్తోంది.