వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్న విజయ్ దేవరకొండ ప్రతి సినిమాలో డిఫరెంట్ లుక్స్ తో ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల డియర్ కామ్రేడ్ సినిమా అనంతరం రౌడి స్టార్ పూర్తిగా ఫుల్ బియర్డ్ తో కనిపించారు. ఇక ఇప్పుడు మరో కొత్త లుక్ తో విజయ్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాడు. నెక్స్ట్ సినిమా కోసం విజయ్ ఇలా స్మార్ట్ గా మారినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఇటీవల పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో కూడా ఒక సినిమా స్టార్ట్ చేయనున్నట్లు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇచ్చి ఆడియెన్స్ కి మంచి కిక్ ఇచ్చాడు. ఆ సినిమా స్టార్ట్ కావడానికి ఇంకా చాలా సమయం ఉంది. ఇకపోతే రీసెంట్ గా కొన్ని యాడ్ షూటింగ్స్ లలో అలాగే ఫోటో షూట్స్ లోతో కూడా విజయ్ బిజీగా గడిపాడు. 

ఫైనల్ గా డియర్ కామ్రేడ్ అనంతరం రౌడీ స్టార్ మరో డిఫరెంట్ పాత్రలో మెప్పిస్తాడాని అభిమానుల్లో ఆశలు రేపాడు. క్రాంతి మాధవ్ ప్రాజెక్ట్ లో రెండు డిఫరెంట్ షేడ్స్ లలో రౌడీ హీరో దర్శనమివ్వనున్నట్లు టాక్. మరి ఆ పాత్ర ఎలా ఉంటుందో తెలియాలంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.