అర్జున్ రెడ్డి - గీత గోవిందం సినిమాలతో బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకున్న విజయ్ దేవరకొండ ఆ తరువాత నోటా సినిమాతో ఊహించని డిజాస్టర్ ని చూశాడు. తెలుగు అండ్ తమిళ్ లో రిలీజైన ఆ సినిమా ఊహించని పరాజయాన్ని ఇవ్వడంతో నెక్స్ట్ ఎలాగైనా టాక్సీ వాలా తో సక్సెస్ ట్రాక్ లోకి వెళ్లాలని చూస్తున్నాడు. 

ఇకపోతే ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల హడావుడి మొదలైన సంగతి తెలిసిందే. ప్రచారాల్లో నేతలంతా చాలా బిజీగా ఉన్నారు. అయితే ఈ ఎలక్షన్స్ లో విజయ్ కీలకపాత్ర పోషించనున్నారు. ఎలక్షన్స్ కమిషన్ విజయ్ దేవరకొండను మహబూబ్ నగర్ జిల్లాకు గాను అంబాసిడర్ గా నియమించారు. 

ప్రజల్లో ఓటుపై అవగాహన కలిగేవిధంగా విజయ్ ని నియమిస్తున్నట్లు ఎన్నికల కమిషన్ అధికారి రజత్ కుమార్ తెలిపారు. వివిధ రంగాల నుంచి మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ - బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ - టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా తో పాటు ప్రముఖ ప్రజాకవి - గాయకుడు గోరేటి వెంకన్న వంటి ప్రముఖులను కూడా అంబాసిడర్లుగా బాధ్యతలను నిర్వహించనున్నట్లు తెలియజేశారు.