పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో  'లైగర్' అనే  టైటిల్ తో విజయ్ దేవరకొండ హీరోగా రూపుదిద్దుకుంటున్న చిత్రం షూటింగ్ మొదలైంది. లాక్ డౌన్ కార‌ణంగా షూటింగ్ నిలిచిపోవ‌డంతో దాదాపు 10 నెల‌ల‌ు గ్యాప్ వచ్చింది. రీసెంట్ గా లైగ‌ర్ ఫ‌స్ట్ లుక్‌తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన విజ‌య్‌దేవ‌ర‌కొండ ఫైన‌ల్ గా సెట్స్ లో జాయిన్ అయ్యాడు. దానికి ఎవిడెన్స్ అన్నట్లుగా తీసిన వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడు పూర్తి చేయనున్నారు...ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది ఆసక్తికరమైన డిస్కషన్ గా మీడియాలో నిలుస్తోంది.

అందుతోన్న సమాచారం మేరకు ఈ చిత్రం 2021 జూలై లో రిలీజ్ చేయనున్నారు. దాదాపు అరవై శాతం షూటింగ్ పెండింగ్ ఉంది. దాన్ని పూరి జగన్నాథ్ జెట్ స్పీడులో మూడు నెలల్లో పూర్తి చేయబోతున్నారు. ఆ తర్వాత మిగతా పనులు పూర్తి చేసి జూలై రెండవ వారంలో రిలీజ్ పెట్టుకోబోతున్నారు. ఈ ప్లాన్ తో ముందుకు వెళ్తున్నారు. జూలై సమ్మ్రర్ లోకి ఎంటరై,నడుస్తూంటుంది. అది సినిమాలకు ఫెరఫెక్ట్ టైమ్. అయితే రిలీజ్ డేట్ విషయమై కరణ్ జోహార్ డెసిషన్ కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ఎందుకంటే ఇది పాన్ ఇండియా ప్రాజెక్టుగా ఇండియా మొత్తం ఒకే సారి రిలీజ్ కానుంది. 

విజయ్ దేవరకొండ ఈ సినిమాలో చాలా ఫిట్ గా కనిపించనున్నారు. అందుకోసం కొన్ని రోజుల నుంచి జిమ్‌లో క‌స‌ర‌త్తులు ప్రారంభించాడు. ఈ సినిమాకు 'సాలా క్రాస్ బ్రీడ్' అని ట్యాగ్ లైన్ పెట్టారు. ఈ సినిమా కోసం థాయ్ లాండ్ లో మార్షల్ ఆర్ట్స్ పై విజయ్ ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్న సంగతి తెలిసిందే.