విజయ్ దేవరకొండ 'ఖుషి' కలెక్షన్లు.. ఆ ఏరియాల్లో దారుణం?
రెండు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలు కూడా కలెక్షన్లు పడిపోవడానికి కారణంగా చెప్తున్నారు. మళ్లీ వీకెండ్ కు పుంజుకోకపోతే...

విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), సమంత రూత్ ప్రభు (Samantha) కాంబినేషన్ లో రూపొందిన సినిమా 'ఖుషి' (Kushi Movie 2023)ఈ రోజు భారీ ఎత్తున రిలీజైంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మల్టిప్లెక్స్ లు, యుస్ లోనూ సినిమా దూసుకుపోతోంది. అయితే బి,సి సెంటర్లలలో పెద్దగా వర్కవుట్ కావటం లేదని ట్రేడ్ అంటోంది. క్లాస్ ఫిల్మ్ కావటం అందుకు కారణంగా చెప్తున్నారు.
అయితే ఇప్పటి దాకా వచ్చిన కలెక్షన్స్ బట్టి 'ఖుషి' సినిమా విజయ్ దేవరకొండకు హిట్ పడ్డట్టే అని లెక్కేసారు. వీకెండ్ తర్వాత మాత్రం సినిమా డ్రాప్ స్టార్ట్ అయ్యింది. ఈ సినిమా తొలి మూడు రోజులూ వసూళ్ల వర్షం కురిపించింది. ఏకంగా రూ.70 కోట్ల గ్రాస్ వసూలు చేసి సులువుగా రూ.100 కోట్ల క్లబ్ లో చేరుతుందని అనుకున్నారు. కానీ వీకెండ్ అనంతరం డ్రాప్ స్టార్ట్ అయ్యింది.మొదటి రోజు రూ.30 కోట్లుగా ఉన్న కలెక్షన్లు.. నాలుగో రోజైన సోమవారం కేవలం రూ.2.01 కోట్లకు పడిపోయింది. అంటే ఒకేసారి 80 శాతం మేర కలెక్షన్లు డ్రాప్ అయ్యాయి. ఐదో రోజైన మంగళవారం (సెప్టెంబర్ 5) ఈ కలెక్షన్లు మరింత పడిపోయాయి. ఇండియా వ్యాప్తంగా కేవలం రూ.2 కోట్లే వచ్చాయని ట్రేడ్ టాక్. ఆక్యుపెన్సీ కేవలం 19.47 శాతమే.
రెండు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలు కూడా కలెక్షన్లు పడిపోవడానికి కారణంగా చెప్తున్నారు. మళ్లీ వీకెండ్ కు పుంజుకోకపోతే నైజాం, యూఎస్ఏలలో తప్ప మిగిలిన ప్రాంతాల్లో ఖుషీ మూవీ డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు తప్పవంటున్నారు. ఆంధ్రా, సీడెడ్ ప్రాంతాల్లో ఖుషీ కలెక్షన్లు దారుణమే అంటున్నారు.
అయితే విజయ్ దేవరకొండ, సమంత కెమిస్ట్రీ అదిరిపోయిందని చెప్తున్నారు. ఎలాగైనా హిట్ కొట్టాలనే తపన లీడ్ పెయిల్ లో కనిపించింది అని, తమ తమ పాత్రల్లో విజయ్ & సమంత జీవించారని చెబుతున్నారు. అలాగే పాటలు కూడా చాలా బాగున్నాయని అవే సినిమాకు పెద్ద హైలెట్ గా చెప్తున్నారు. అయితే ఫస్టాఫ్ ఉన్నంతగా సెకండాఫ్ లో సీన్స్ లేవని కొందరంటున్నారు. క్లైమాక్స్ మాత్రం మళ్లీ లేచిందని, చాలా ఎమోషనల్ గా ముగించారని చెప్తున్నారు.
మలయాళ నటుడు జయరామ్, మరాఠీ నటుడు సచిన్ ఖేడేకర్, ఇంకా మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, 'వెన్నెల' కిశోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ తదితరులు 'ఖుషి'లో నటించారు. ఈ చిత్రానికి పాటలు : శివ నిర్వాణ, పోరాటాలు : పీటర్ హెయిన్, సంగీత దర్శకుడు : హేషామ్ అబ్దుల్ వాహాబ్, సీఈవో : చెర్రీ, ఛాయాగ్రహణం: జి. మురళి.