'నోటా'లో హైలైట్ అదే.. విజయ్ దేవరకొండ ఫుల్ లెంగ్త్ సీఎం కాదట!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 14, Sep 2018, 4:54 PM IST
vijay devarakonda is not a full length cm
Highlights

'గీత గోవిందం' సినిమాతో స్టార్ హీరోల జాబితాలోకి చేరిపోయాడు విజయ్ దేవరకొండ. తన నటన, ప్రవర్తనతో యూత్ కి ఆల్ టైమ్ ఫేవరెట్ హీరోగా మారిపోయాడు. అతడి సినిమా కోసం అభిమానులు ఎదురుచూసే రోజులు వచ్చేశాయి. 

'గీత గోవిందం' సినిమాతో స్టార్ హీరోల జాబితాలోకి చేరిపోయాడు విజయ్ దేవరకొండ. తన నటన, ప్రవర్తనతో యూత్ కి ఆల్ టైమ్ ఫేవరెట్ హీరోగా మారిపోయాడు. అతడి సినిమా కోసం అభిమానులు ఎదురుచూసే రోజులు వచ్చేశాయి.

ప్రస్తుతం అతడు నటించిన 'నోటా' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఇటీవల విడుదలైన సినిమా ట్రైలర్ ఆ అంచనాలను మరింత పెంచేసింది. ట్రైలర్ ని బట్టి సినిమాలో విజయ్ దేవరకొండ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది.

అయితే సినిమా మొత్తం విజయ్ ముఖ్యమంత్రిగా కనిపించడట. క్లైమాక్స్ వచ్చేసరికి విజయ్ సీఎం అవుతాడట. చివరి 20 నిమిషాలు సినిమాకు కీలకమని అంటున్నారు. ముఖ్యమంత్రిగా విజయ్ తన నటనాపటిమతో సినిమా స్థాయిని మరింత పెంచేశాడని టాక్. ముఖ్యమంత్రిగా విజయ్ చెప్పే డైలాగ్స్ కి ఆడియన్స్ ఫిదా అయిపోతారని చెబుతున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. 

loader