Asianet News TeluguAsianet News Telugu

ప్రభాస్ అన్న కోసం చేశా, నేను నాగికి లక్కీ కాదు..మహానటి, కల్కి సక్సెస్ కి కారణం ఇదే, విజయ్ దేవరకొండ కామెంట్స్

ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వచ్చిన కల్కి 2898 ఎడి చిత్రం భారీ బాక్సాఫీస్ విజయం దిశగా దూసుకుపోతోంది. మూడు రోజుల్లో ఈ చిత్రం ఆల్రెడీ 380 కోట్ల గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా రాబట్టింది.

Vijay devarakonda interesting comments on Kalki 2898 AD dtr
Author
First Published Jun 30, 2024, 10:46 PM IST

ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వచ్చిన కల్కి 2898 ఎడి చిత్రం భారీ బాక్సాఫీస్ విజయం దిశగా దూసుకుపోతోంది. మూడు రోజుల్లో ఈ చిత్రం ఆల్రెడీ 380 కోట్ల గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా రాబట్టింది. ఆదివారం రోజు వసూళ్లతో ఈ చిత్రం 500 కోట్ల క్లబ్ లో చేరబోతోంది. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు విధ్వంసం ఏ రేంజ్ లో ఉందో అని. 

హైదరాబాద్ లో విజయ్ దేవరకొండ ఒక ప్రైవేట్ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. విజయ్ దేవరకొండ కల్కి చిత్రంలో అర్జునుడిగా నటించిన సంగతి తెలిసిందే. దీనితో మీడియా ప్రతినిధులు విజయ్ దేవరకొండ పై ప్రశ్నల వర్షం కురిపించారు. 

కల్కి చిత్రం గురించి అడుగుతూ ఉక్కిరి బిక్కిరి చేశారు. నాగ్ అశ్విన్ తెరకెక్కించే ప్రతి చిత్రంలో నటిస్తున్నారు. మిమ్మల్ని నాగ్ అశ్విన్ కి లక్కీ చామ్ అంటున్నారు అని రిపోర్టర్ అనగా విజయ్ దేవరకొండ స్పందించాడు. నేను నాగికి లక్కీ కాదు. ప్రభాస్ అన్న కోసం, నాగి కోసం ఈ సినిమాలో నటించా. 

కల్కి అంత అద్భుతంగా ఉంది కాబట్టే విజయం సాధించింది. ఇందులో మనదేమి లేదు అంటూ విజయ్ దేవరకొండ హుందాగా బదులిచ్చాడు. మహానటి , కల్కి చిత్రాలని నాగి అంత బాగా తెరకెక్కించారు కాబట్టే విజయం సాధించాయి అని అన్నారు. ప్రభాస్ అన్న కోసం ఈ చిత్రంలో నటించారు. నాగి పిలిస్తే ఒకరోజు షూటింగ్ కి వెళ్లినట్లు విజయ్ దేవరకొండ తెలిపారు. నాగి క్రియేట్ చేసిన ఒక యూనివర్స్ లో నేను చిన్న పాత్ర చేశాను. అంతే కానీ ప్రభాస్ కర్ణుడు.. నేను అర్జునుడు లాంటి పోటీ లేదని విజయ్ తెలిపాడు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios