క్యారెక్టర్ తో స్క్రీన్ పై ఎక్కువగా ఆకట్టుకునే విజయ్ దేవరకొండ రొమాంటిక్ - కామెడీ, హారర్.. ఇలా అన్ని కోణాల్లో కొత్తగా ట్రై చేస్తుంటాడు. ఇక మొదటిసారి బారి యాక్షన్ సీక్వెన్స్ తో రౌడీ హీరో ప్రేక్షకులకు సరికొత్త కిక్ ఇవ్వడానికి సిద్దమవుతున్నాడు. రీసెంట్ గా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో విజయ్ కొత్త సినిమాను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. 

ఆనంద్ అన్నామలై దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాకు హీరో అనే టైటిల్ ను కూడా సెట్ చేశారు. తెలుగు తమిళ్ లో ఒకేసారి సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ కోసం విజయ్ స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడట. అసలైతే సినిమాలో విజయ్ బైక్ రేజర్ గా కనిపించనున్నాడు. 

అంతర్జాతీయ స్థాయి రోడ్ రేసింగ్ ఛాంపియన్ రజిని కృష్ణన్ దగ్గర కూడా విజయ్ స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడట. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ సినిమా యాక్షన్ ప్రేమికులను ఆకట్టుకోవాలని విజయ్ కష్టపడుతున్నాడు. బైక్ రేజింగ్ కి సంబందించిన ఫైట్ సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనుందని టాక్. మరి విజయ్ ఈ సినిమాతో ఎంతవరకు సక్సెస్ అందుకుంటాడో చూడాలి.