మరోసారి మంచి మనసు చాటుకున్న విజయ్ దేవరకొండ, ఏం చేశాడంటే..?
మరోసారి మంచి మనసు చాటుకున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ. ఇప్పటికే ఎంతో మందికి సాయం చేసి.. వారి జీవితాల్లో వెలుగు నింపిన రౌడీ హీరో.. తాజాగా మరోకరికి సాయం చేశాడు.
కష్టాల్లో ఉన్న పేదవారికి సాయం చేయడంలో ముందు ఉంటాడు టాలీవుడ్ రౌడీ మీరో విజయ్ దేవరకొండ. మరీ ముఖ్యంగా ఏ విపత్తు వచ్చినా.. నలిగిపోయే మధ్యతరగతి వారికి ఎక్కువ సపోర్టీవ్ గా ఉంటుంటాడు. కష్టాల్లో ఉన్న వారికి సాయంగా ఉంటారనే విషయం అందరికి తెలిసిందే. తాజాగా ఆయన మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళికి చెందిన ఒక పాప ఇటీవల జరిగిన ఒక ప్రమాదంలో కాలు పోగొట్టుకుంది. ఎంతో భవిష్యత్తు ఉన్న ఆ పాపకు ఇలా జరగడంతో.. చాలా మంది ఈ విషయంలో స్పందిస్తున్నారు.
ఇక తన అభిమాన సంఘాల ద్వారా విషయం తెలుసుకున్న విజయ్ దేవరకొండ. వెంటనే ఆచిన్నారికి లక్ష రూపాయల చెక్ పంపించారు. ఈ చెక్ ను ఆ పాపకు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అందించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు విజయ్ ను ఎంతగానో ప్రశంసించారు. 'దైవం మానుష రూపేణ' అంటుంటారు. ఈ పదానికి అర్థంగా నిలుస్తూ విజయ్ దేవరకొండ చేసిన సాయం ఆయన సహృదయానికి నిదర్శనమని ఆయన అన్నారు.
ఇక గతంలో కూడా విజయ్ దేవరకొండ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేశారు. మరీ ముఖ్యంగా కరోనా టైమ్ లో ఎంతో మందిని ఆదుకోవడంతో పాటు. ఆర్ధికంగా సహకారం అందించాడు. మిడిల్ క్లాస్ ఫండ్ పేరుతో కరోనా టైమ్ లో పేదలను ఆదుకున్న విజయ్.. ఆతరువాత కూడా ఎన్నో విపత్తుల్లో ప్రజలను కాపాడటానికి ఫండ్ రూపంలో డబ్బులు అందించాడు. అంతే కాదు.. తన అభిమానులలో 100 మందిని సెలక్ట్ చేసి ఇష్టమైన ప్రదేశాలకు టూర్లకు పంపించడంతో పాటు... రీసెంట్ గా తన ఫ్యాన్స్ కు సెలెక్టెడ్ గా సాయం అందించాడు.