టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ గోవా చెక్కేస్తున్నారు. గోవాకు పయనమైన విజయ్ దేవరకొండ హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో తన టీంతో కనిపించడం జరిగింది. ట్రెండీ షర్ట్ అండ్ షార్ట్ ధరించి ఉన్న విజయ్ దేవరకొండ... బ్లాక్ మాస్క్ ముఖానికి పెట్టుకున్నారు. మరికొద్ది గంటల్లో న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ మొదలుకానున్నాయి. దీనితో న్యూ ఇయర్ 2021 సెలెబ్రేషన్స్ కోసం ఆయన గోవా వెళ్లడం జరిగింది. 2020 చిత్ర పరిశ్రమకు కరోనా రూపంలో షాక్ ఇవ్వగా... కనీసం 2021 మంచి విషయాలు పంచాలని అందరూ కోరుకుంటున్నారు. ఇక విజయ్ దేవరకొండ కొత్త సంవత్సరానికి గోవాలో గ్రాండ్ పార్టీ చేసుకుంటూ వెల్కమ్ చెప్పనున్నారని తెలుస్తుంది. 

కాగా ఈ ఏడాది విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ అనుకున్నంత విజయం సాధించలేదు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఆ చిత్రం ప్లాప్ టాక్ తెచ్చుకుంది. దీనితో దర్శకుడు పూరి జగన్నాధ్ తెరకెక్కిస్తున్న చిత్రంపై భారీ ఆశలు పెట్టుకున్నారు. దర్శకుడు పూరి ఫైటింగ్ నేపథ్యంలో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిస్తున్నాడు. బాలీవుడ్ యంగ్ లేడీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. 

ఈ చిత్రం తరువాత విజయ్ దేవరకొండ దర్శకుడు సుకుమార్ తో మూవీ ప్రకటించిన విషయం తెలిసిందే. సుకుమార్ ప్రస్తుతం పుష్ప మూవీ తెరకెక్కిస్తుండగా... వచ్చే ఏడాది చివర్లో విజయ్ ప్రాజెక్ట్ సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఈ మూవీపై  టాలీవుడ్ లో మంచి అంచనాలున్నాయి. మొత్తంగా క్రేజీ ప్రాజెక్ట్స్ కి సైన్ చేస్తూ... విజయ్ దేవరకొండ దూసుకుపోతున్నారు.