సెట్స్ పైకి విజయ్ దేవరకొండ - గౌతమ్ తిన్ననూరి సినిమా, ఓపెనింగ్ ఎప్పుడంటే..?
విజయ్ దేవరకొండ కాస్త జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. ఇప్పటి వరకూ తగిలిన ఎదురు దెబ్బల ప్రభావంతో.. ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నాడు. రీసెంట్ గా శివ నిర్వాణ సినిమా కంప్లీట్ చేసిన రౌండీ హీరో.. గౌతమ్ తో సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు.
విజయ్ దేవరకొండకు వరస పరాజయాలు నిద్ర లేకుండా చేస్తున్నాయి. అయినా తేరుకుని సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు యంగ్ హీరో.. రీసెంట్ గా శివ నిర్వాణతో ఖుషి మూవీని షూటింగ్ ను కంప్లీట్ చేసిన విజయ్.. తన నెక్స్ట్ సినిమాను గౌతమ్ తిన్ననూరితో చేస్తున్నట్లు తెలుస్తోంది. దిల్ రాజు ప్రొడ్యూసర్ గా ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. ఇక ఈమూవీని వీలైనంత త్వరలో సెట్స్ పైకి తీసుకెళ్ళే యోచనల లో ఉన్నారట మేకర్స్. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తవ్వడంతో షూటింగ్ డేట్ కోసం ఎదురు చూస్తున్నట్టు సమాచారం.
ఇక ఈమూవీని ముందుగా రామ్‌చరణ్ తో చేయాలి అనుకున్నాడు గౌతమ్. కథ కూడా వినిపించాడు. అటు చరణ్ కూడా కథ నచ్చడంతో గౌతమ్‌తో సినిమా చేస్తున్నట్లు అఫిషియల్‌గా ప్రకటించాడు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. దాంతో ఇక ఇప్పుడు ఆదే కథతో విజయ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు సబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించబోతున్నారట
వరుస ఫెయిల్యూర్స్ విజయదేవరకొండను ఉక్కిరి బిక్కిరి చేశాయి. ముఖ్యంగా వరల్డ్ ఫేమస్ లవర్ వంటి భారీ డిజాస్టర్ తర్వాత.. చాలా జాగ్రత్తగా.. తన కెరీర్ నుముందుకు తీసుకెళ్లాలని అనుకున్నాడు విజయ్.. అందుకే గ్యాప్ నులెక్క చేయకుండా రెండేళ్ళు ఓపిగ్గా ఉండి.. టైమ్ తీసుకుని మరీ లైగర్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిన లైగర్ ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 25న రిలీజైంది. కాని ఈ సినిమా డిజాస్టర్ టాక్ రావడంతో విజయ్ దేవరకొండ ప్రపంచ తలకిందులైనట్టు అయ్యింది. రిలీజ్ అయిన ఫస్ట్ డే నుండే నెగెటీవ్ టాక్ తెచ్చుకుందీ సినిమా.. వారంలోపే థియేటర్స్ నుంచి వెళ్లిపోయింది లైగర్.
పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకోవాలనుకున్నాడు విజయ్ దేవరకొండ. లైగర్ సినిమాతో బాలీవుడ్ లో పాగా వేయాలి అని అనుకున్నాడు. కాని అది కలగానే మిగిలిపోయింది. ప్రస్తుతం ఈయన శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమా చేస్తున్నాడు.సమంత హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం రోమ్-కామ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుంది. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేసింది. ఈసినిమా షూటింగ్‌లకు కాస్త బ్రేక్ ఇచ్చారు. దాంతో తన నెక్ట్స్ మూవీ షూటింగ్ ను స్టార్ట్ చేస్తే ఓ పనైపోతుంది అనుకుంటున్నాడు విజయ్. ప్రస్తుతం దీనికి సంబంధించి గ్రౌండ్ వర్క్ జరుగుతున్నట్టు తెలుస్తోంది.