రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ అరుదైన రికార్డ్ ని సృష్టించారు. సౌంత్‌ ఇండియన్‌ సన్సేషన్‌గా నిలిచిన విజయ్‌ ఇప్పుడు పవర్‌ స్టార్‌ పవన్‌, సూపర్‌ స్టార్‌ మహేష్‌, స్టయిలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌లను వెనక్కి నెట్టేశాడు. వారందరిని అదిగమించాడు. ఎప్పుడొచ్చామ్‌ కాదన్నయ్య.. బుల్లెట్‌ దిగిందా లేదా? అనే `పోకిరి` డైలాగ్‌ని రియల్గా చేసి చూపించారు. తాజాగా విజయ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పది మిలియన్‌ ఫాలోవర్స్ కి రీచ్‌ అయ్యారు. 

అకౌంట్‌ ప్రారంభించిన అతి తక్కువ సమయంలోనే ఇంతటి భారీ ఫాలోయింగ్‌ని సంపాదించడం సౌత్‌లోనే ఫస్ట్ కావడం, ఆ ఘనత విజయ్‌కి దక్కడం విశేషం. విజయ్‌ కంటే ముందే అకౌంట్‌ ప్రారంభించిన బన్నీ 9.7 మిలియన్స్ ఫాలోవర్స్ ని కలిగి ఉన్నాడు. మహేష్‌ బాబు 6.1మిలియన్స్‌ ఫాలోవర్స్ ని పొందితే, పవన్‌ ఇంకా నాలుగు లక్షల దగ్గరే ఉన్నాడు. 

ఈ క్రమంలో ఇన్‌స్టాలో ఏకంగా కోటీ మంది ఫాలోవర్స్ దక్కింకుకొని రికార్డు సృష్టించాడు. సౌత్ ఇండియన్ స్టార్స్ లలో కోటి మంది ఫాలోవర్స్ ఉన్న నటుడు విజయ్ ఒక్కడే కావడం విశేషం. ఈ అరుదైన రికార్డును ఫ్యాన్స్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. `1క్రోర్ ఇన్ స్టా రౌడీస్` అనే ట్యాగ్ తో వరల్డ్ వైడ్ గా సోషల్ మీడియా అంతా ట్రెండింగ్ చేస్తున్నారు.  విజయ్ దేవరకొండ కు యూత్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 

`అర్జున్‌రెడ్డి`, `గీతగోవిందం`తో ఆయన భారీ పాపులారిటీని సొంతం చేసుకున్నారు. ఆ ఇమేజ్‌ని ఫాలోయింగ్‌గా మార్చుకున్నారు. దీనికితోడు డిఫరెంట్ అటిట్యూడ్, స్టైల్ తో తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక సోషల్ మీడియాలో కూడా తనదైన స్టైల్లో క్రియేటివ్ గా పోస్ట్ లు పెడుతూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. అందుకే ఇంతమంది విజయ్ కు ఫిదా అయ్యారు. 

తను ఓ ఫోటో పెట్టినా, వీడియో పెట్టినా లైకులు, కామెంట్లతో అభిమానులు ప్రేమ కురిపిస్తారు. విజయ్ కూడా 10 మిలియన్ ఫాలోవర్స్ పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ తో ప్యాన్ ఇండియా సినిమా `ఫైటర్‌`లో నటిస్తున్నారు. ఆ తర్వాత శివ నిర్వాణతో ఓ సినిమా, సుకుమార్ డైరెక్షన్లలో మరో సినిమా చేయనున్నారు.