స్టేజ్ పై హీరోయిన్ కాళ్లు పట్టుకున్న హీరో!

vijay  devarakonda gives shock to rashmika
Highlights

అయ్యో అందరికంటే ఇంపార్టెంట్ మా మేడమ్ గారి బ్లెస్సింగ్స్ అంటూ రష్మిక కాళ్లు పట్టుకునే ప్రయత్నం చేశాడు

యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఏం మాట్లాడినా..? ఏం చేసినా అది సంచలనమే. రెగ్యులర్ హీరోలకు భిన్నంగా యూత్ ను ఎట్రాక్ట్ చేస్తో ముందుకు వెళ్తున్నాడు. సినిమాను ప్రమోట్ చేసే విషయంలో అతడి స్ట్రాటజీలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అలానే తన సినిమాలకు ఆడియన్స్ ను రప్పిస్తున్నాడు. తాజాగా అతడు నటించిన 'గీత గోవిందం' సినిమా ఆడియో విడుదల కార్యక్రమం జరిగింది.

ఈ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ స్టేజ్ మీద హీరోయిన్ రష్మిక కాళ్లు పట్టుకొని అందరికీ షాక్ ఇచ్చాడు. అదెలా అంటే.. స్టేజ్ మాట్లాడడానికి మైక్ తీసుకున్న విజయ్ ముందుగా తన రౌడీలకు(అభిమానులను ముద్దుగా పిలుచుకుంటారు) హలో చెప్పాడు. ఆ తరువాత పెద్దలందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే ఓ పనైపోతుంది అల్లు అరవింద్ మొదలుకొని డైరెక్టర్, టెక్నీషియన్స్, అల్లు అర్జున్ కాళ్లకు నమస్కారం చేస్తూ 'అయ్యో అందరికంటే ఇంపార్టెంట్ మా మేడమ్ గారి బ్లెస్సింగ్స్' అంటూ రష్మిక కాళ్లు పట్టుకునే ప్రయత్నం చేశాడు.

దీంతో షాక్ అయిన రష్మిక వెనక్కి వెళ్లిపోయింది. అయినా.. విజయ్ తాను అనుకున్నట్లుగానే చేశాడు. ఓ హీరో అయి ఉండి స్టేజ్ మీద హీరోయిన్ కాళ్లు పట్టుకోవడం అందరూ షాక్ అయినా.. విజయ్ అందరినీ నవ్వించడానికే ఆ విధంగా చేశాడు. విజయ్ చేసిన అల్లరికి స్టేజ్ మీద ఉన్నవారితో పాటు అభిమానులు కూడా బిగ్గరగా నవ్వుకున్నారు. పరశురామ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

loader