Asianet News TeluguAsianet News Telugu

గీతగోవిందం సినిమాకు సీక్వెల్ ప్లాన్.. విజయ్-రష్మిక మ్యాజిక్ రిపీట్ అవుతుందా..?

ఒక్కొసారి చిన్న సినిమాలు కూడా చరిత్ర సృష్టిస్తుంటాయి. అటువంటిసినిమాల్లో టాలీవుడ్ నుంచి వచ్చిన గీత గోవిందం కూడా ఒకటి. విజయ్ దేవరకొండకు బ్రేక్ ఇచ్చిన ఈ మూవీకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. 
 

Vijay Devarakonda Geetha Govindam Movie Sequel Planning
Author
First Published Feb 3, 2023, 6:41 PM IST

ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చింది గీతగోవిందం సినిమా. నిర్మాతలకు కాసలు వర్షం కురిపించిందీ మూవీ. టాలీవుడ్ లో సంచలన విజయం  నమోదు చేసింది గీత గోవిందం సినిమా.పెద్దగా అంచనాల్లేకుండా రిలీజ్ అయిన ఈసినిమా విజయ్ కు క్లాసిక్ క్రేజ్ ను తీసుకువచ్చింది. అర్జున్ రెడ్డితో మాస్.. హీరోగా సక్సెస్ అయిన విజయ్ కు వెంటనే ఈ సినిమా పడటంతో.. రౌడీ హీరో కెరీర్ పరుగులు తీసింది. 

అంతేకాదు ఈసినిమాతో రష్మిక, విజయ్‌ల కెమిస్ట్రీకు కూడా అద్భుతంగా వర్కౌట్ అయ్యింది. ఇప్పటికీ వీళ్ళు లవర్స్ గా మారారని.. చెట్టాపటాలేసుకుని తిరుగుతున్నట్టు.. సోషల్ మీడియా కోడై కూస్తుంది. ఇంతలా టాలీవుడ్ లో గుర్తుండిపోయిన ఈసినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారట టీమ్. ఒక సింపుల్‌ లవ్‌స్టోరీతో రికార్డులు తిరగరాయచ్చు అని నిరూపించిన ఈసినిమాకు మరో సినిమాను సీక్వెల్ గా తీసుకురావాలని గీతా ఆర్ట్స్ ప్లాన్ చేస్తుందట. ఈరకంగా కథ విషయంలో కదలిక కూడా వచ్చినట్టు తెలుస్తోంది. 

ఈ విషయంలో గీతాఆర్ట్స్‌ బ్యానర్‌ నుండి డైరెక్టర్ పరుశురామ్‌కు ఫోన్‌ కూడా వెళ్లినట్టు తెలుస్తోంది.  గీత గోవిందం సీక్వెల్‌కు కథ రెడీ చేయమని చెప్పినట్లు టాక్. ప్రస్తుతం సీక్వెల్స్ సినిమాలు ట్రెండ్ నడుస్తోంది.. ఈ ఫార్ములా  బాగా వర్కవుట్‌ అవుతుంది కూడా.దాంతో మేకర్స్ గీతగోవిందం సీక్వెల్ పై మనసు పారేసుకున్నట్టు తెలుస్తోంది. కానీ ఈ సీక్వెల్ లో విజయ్ , రష్మికలు నటిస్తారా..? లేక ఇంకెవరైనా నటిస్తారా అనేదానిపై సస్పెన్స్ నడుస్తోంది. ఒక వేళ విజయ్, రష్మిక కలిసి మళ్లీ నటిస్తే.. ఇక వారి బంధంపై రూమర్స్ ఇంకా జోరుగా నడుస్తాయంటున్నారు సినీ జనాలు.

ఐదేళ్ల కిందట 15 కోట్ల ప్రీ బిజినెస్‌ జరుపుకున్న గీతాగోవిందం ఏకండా 75 కోట్ల వరకు షేర్‌ను రాబట్టి సంచలనాన్ని సృష్టించింది.విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం ఖుషీని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. దీని తర్వాత గౌతమ్‌ తిన్ననూరితో పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ చేయబోతున్నాడు. మరోవైపు రష్మిక పుష్ప సీక్వెల్‌తో బిజీగా ఉంది. అటు పరుశురామ్‌ కూడా  నాగచైతన్యతో ప్రాజెక్ట్‌ లాక్‌ అయినట్లు తెలిసింది. మరి ఇంత టైట్ షెడ్యూల్ లో గీతగోవిందం వర్కౌట్ అవుతుందా లేదా అనేది చూడాలి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios